ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టిడిపి మహిళ నాయకులు భేటీ

0
148

ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా ఎమ్మెల్యేల భేటీ

 

ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన పరిటాల సునీత, ఇతర నేతలు

 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ సమావేశం

 

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భేటీ ఫోటోలు

 

భిన్న రాజకీయ కూటముల నేతల కలయికపై చర్చ

 

దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే పరిటాల సునీత సహా పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పరిటాల సునీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. 

 

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం వివిధ పార్టీల నేతలు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

 

ప్రస్తుతం టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండగా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇలా భిన్న రాజకీయ ధ్రువాలకు చెందిన నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో పాత పరిచయాల కారణంగానే మర్యాదపూర్వక భేటీ అని భావిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకారం
చీరాల: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు...
By Gadiyapudi Narendra 2026-02-04 16:35:59 0 221
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు...
By Kothuru Murali 2026-06-30 16:37:01 0 158
Andhra Pradesh
ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు అధ్వానం
సీతానగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రహదారిపై పెద్ద పెద్ద గోతులతో అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర...
By Boiena Rajesh 2026-09-12 06:20:29 0 108
Telangana
*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*
_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది....
By Ponnala Srinivasrao 2026-04-12 01:21:57 0 187
Andhra Pradesh
ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల.
వర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్...
By Pagadala Venkateswar 2026-05-15 06:11:09 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com