ఎమ్మియనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
217

మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడోన గ్రామం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దైవ దర్శనార్థం ప్రయాణిస్తున్న భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.

ఈ ఘటన కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. రహదారి భద్రత, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌మాద ప్రదేశాల సమీపంలో ట్రామా కేర్ సెంటర్లు, తక్షణ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రాణనష్టం పెరుగుతోందని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు గౌరవప్రదమైన పరిహారం వెంటనే ప్రకటించి అందజేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు గట్టిగా డిమాండ్ చేశారు

యాత్రికులు అధికంగా ప్రయాణించే మార్గాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలు, అత్యవసర సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం పనితీరుపై రీజనల్ మేనేజర్ సమీక్ష
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్,...
By Kothuru Murali 2026-05-05 15:12:51 0 145
Andhra Pradesh
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన.. హెచ్ఎం సహా ముగ్గురిపై వేటు.
పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన...
By Pagadala Venkateswar 2026-09-13 07:26:54 0 56
BMA
JWS Enhances Financial Power of Indian Journalists
The economic security of field reporters has been reinforced through the revised Journalist...
By JoinBMA 2026-08-20 05:49:10 0 85
Andhra Pradesh
3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ...
By John Baji 2025-12-30 13:10:58 0 228
Andhra Pradesh
Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.
ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స...
By Pagadala Venkateswar 2026-03-01 10:59:10 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com