"బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|

0
407

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు. డీసీపీ చౌ. శ్రీధర్ ఐపీఎస్ నేతృత్వంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

ఈ మెరుపు దాడుల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 100 ఆక్సిటోసిన్ బాటిల్స్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మరియు ఒక హుక్కా పాట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల అనంతరం అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచేందుకు, డ్రగ్స్ మరియు ఇతర చట్టవిరుద్ధ పనులను అరికట్టేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు. 

స్థానిక పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
BMA
Green Reporting: The Deadly Cost of Eco-Journalism
Environmental journalists face escalating dangers as they expose illegal logging, corporate...
By JoinBMA 2026-08-19 10:16:44 0 185
Telangana
జర్మనీ సహా విదేశాల్లో ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న టామ్కామ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 13: నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు...
By Avunoori Mahesh 2026-05-13 10:27:15 0 230
Telangana
"టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ట్రాఫిక్ భద్రతపై అవగాహన.|
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీస్...
By Sidhu Maroju 2026-06-13 12:59:40 0 249
Telangana
డ్రంకెన్ డ్రైవ్ స్వీయపర్యవేక్షణ లో హైదరాబాద్ C.P. సజ్జనర్ IPS.|
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌...
By Sidhu Maroju 2025-12-25 08:07:31 0 302
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com