మచ్చ బొల్లారంలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయి పండుగ.. అల్వాల్ ల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి.|

0
199

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం ప్రాంతంలో షీతలమ్మ – బొద్రాయి పండుగ 2వ వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నూతనంగా ప్రతిష్ఠించిన కాటమరాయుని విగ్రహాన్ని పునఃప్రారంభించడం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే బొద్రాయి సంఘం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ వేడుకలు డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి సమక్షంలో నిర్వహించగా, శ్రీశైలం యాదవ్, సర్వేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కొండల్ రెడ్డి, దేవ తదితరులు మరియు అనేక మంది స్థానికులు పాల్గొన్నారు.

అదే రోజు అనంతరం, మైనంపల్లి హనుమంతరావు అల్వాల్ మెయిన్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమానత్వం, న్యాయం, సామాజిక సంస్కరణల కోసం ఆయన చేసిన అపూర్వ సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్‌కు తమ గౌరవాన్ని తెలిపారు.

#sidhumaroju

Alwal 

 

 

Search
Categories
Read More
Telangana
జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య(...
By Sunka Santhosh 2026-07-07 17:56:06 0 274
Tamilnadu
Tamil Nadu Rolls Out Major ₹12,642 Crore Rural Scheme
The Tamil Nadu government has officially launched the ambitious Vikshit Bharat Guarantee for...
By Lokeshwari Panthadi 2026-07-01 04:17:03 0 108
SURAKSHA
Prateek Jain IAS: Championing Good Governance
A Young Telangana IAS Officer Empowering Citizens with Transparent Administration and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-14 09:25:16 0 270
Telangana
ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.హరీష్ రావు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం....
By Ponnala Srinivasrao 2026-07-31 02:31:22 0 161
Andhra Pradesh
తెలుగు మాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవ పోలీస్ శాఖ ఘన నివాళి
అన్నమయ్య జిల్లా - మదనపల్లె తేదీ:02.08.2026   తెలుగు నాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవకు...
By Benguluri Madhubabu 2026-08-03 00:41:46 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com