మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.

0
1K

కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తాళ్లపల్లి రవి తెలిపారు. శుక్రవారం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, సమాజ సేవకుడు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ జనరల్ డాక్టర్ బోల్లమల్ల నర్సింగ్ రావులు ఇటీవల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మాల ముద్దు బిడ్డ గడ్డం వివేక్ ను కలిశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామిని గజమాలతో సత్కరించి సన్నానించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు సంపాదించిన మాల జాతి ముద్దు బిడ్డ, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి రాష్ట్ర ఏర్పాటు కోసం పదవి త్యాగం చేసిన త్యాగశిలీ అని కొనియాడారు. తండ్రి (కాకా) వెంకట స్వామి అడుగు జాడల్లో ప్రజా సేవలో ఎల్లప్పుడు ముందు ఉండే వివేక్ వెంకట స్వామి సేవలను గుర్తించి మంత్రిగా పదవీ బాద్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, ఎం.కాంతయ్య, సోషల్ మీడియా కన్వీనర్ పెరుమాళ్ళ ధనమ్మ, సామాజికవేత్త డా.రాజు వడాల భాస్కర్, రాష్ట్ర నాయకులు మాడుగుల శ్రీనివాస్, బొప్ప నగేష్, తాళ్లపల్లి విజయ్, నరేష్, సిహెచ్ దివ్య, గౌరీ, చైతన్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Karnataka
Guided Tours Begin at Bengaluru’s Iconic Vidhana Soudha
From June 1, 2025, Vidhana Soudha, Karnataka’s legislative seat, opened its doors for...
By Bharat Aawaz 2025-07-17 06:47:46 0 958
Telangana
Road Safety in Telangana | తెలంగాణలో రోడ్ సేఫ్టీ సమీక్ష
రాష్ట్రంలో రోడ్డు భద్రతపై జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ...
By Rahul Pashikanti 2025-09-11 04:12:29 0 18
Andhra Pradesh
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా...
By mahaboob basha 2025-07-25 01:51:01 0 829
Telangana
Banks Urged on Farm Loans | రైతు రుణాలపై సానుభూతి వహించండి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతు రుణాల విషయంలో బ్యాంకులు సానుభూతి చూపాలని విజ్ఞప్తి చేశారు....
By Rahul Pashikanti 2025-09-09 11:45:03 0 36
Sports
2nd Test Day 1
Indian skipper Shubman Gill stars for Team India as he scored his 7th Test century in spectacular...
By Bharat Aawaz 2025-07-02 17:53:09 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com