ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు

0
231

చీరాల 

భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి సందర్భంగా చీరాల ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఎస్ఎంసి. చైర్మన్ దగ్గుబాటి రాంబాబు ఆధ్వర్యంలో అత్యంత గౌరవప్రదంగా నిర్వహించడం జరిగింది.

మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దగ్గుబాటి రాంబాబు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన సమాజానికి అందించిన సేవలు, ముఖ్యంగా అణగారిన వర్గాల సాధికారత కోసం చేసిన పోరాటం గురించి ప్రస్తావించారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యలో, సామాజిక సేవలో ముందుకు సాగాలని సూచించారు.అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించి, రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానీయుడిగా ఆయనను కొనియాడారు. 

కార్యక్రమం ముగింపులో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ వేడుకలలో ఎస్ఎంసి. మెంబర్ హేమచంద్ర శ్రీనివాస్, పాఠశాల కంప్యూటర్ టీచర్ మహేష్ ,స్టడీ టీచర్ భవాని, వాచ్ మెన్ శ్రీనివాసరావు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
By Kothuru Murali 2026-03-21 06:20:14 0 205
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:46 0 370
Andhra Pradesh
Gold, Silver Prices: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు!!!!!
Gold, Silver Prices: దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు...
By SivaNagendra Annapareddy 2025-12-19 07:21:08 0 257
Telangana
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి,ఖురేషి (స్లాటర్ హౌస్...
By Avunoori Mahesh 2026-05-08 14:09:28 0 253
Andhra Pradesh
పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-04-10 04:42:30 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com