ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు

0
230

చీరాల 

భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి సందర్భంగా చీరాల ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఎస్ఎంసి. చైర్మన్ దగ్గుబాటి రాంబాబు ఆధ్వర్యంలో అత్యంత గౌరవప్రదంగా నిర్వహించడం జరిగింది.

మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దగ్గుబాటి రాంబాబు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన సమాజానికి అందించిన సేవలు, ముఖ్యంగా అణగారిన వర్గాల సాధికారత కోసం చేసిన పోరాటం గురించి ప్రస్తావించారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యలో, సామాజిక సేవలో ముందుకు సాగాలని సూచించారు.అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించి, రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానీయుడిగా ఆయనను కొనియాడారు. 

కార్యక్రమం ముగింపులో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ వేడుకలలో ఎస్ఎంసి. మెంబర్ హేమచంద్ర శ్రీనివాస్, పాఠశాల కంప్యూటర్ టీచర్ మహేష్ ,స్టడీ టీచర్ భవాని, వాచ్ మెన్ శ్రీనివాసరావు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్
      రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో...
By Benguluri Madhubabu 2026-08-11 09:32:04 0 212
Andhra Pradesh
అనంతపురం: జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త
*ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తీపికబురు* 💐 *ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* 🙏 *ఆర్డీటీకీ...
By Eslavath RameshNaik 2026-03-24 07:23:35 0 468
Andhra Pradesh
పేరెంట్స్ డే కు హాజరైన నందవరం బిజెపి నాయకులు
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ నందవరం...
By Boya Dasthagiri 2026-07-25 01:46:14 0 159
Telangana
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
By Terli Ashok 2026-01-25 09:31:18 0 242
Andhra Pradesh
గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే రాము
*కూటమి ప్రభుత్వ పాలనలో.... గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 13:56:55 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com