మాకు చెప్పులు అక్కర్లేదు..ఆధారాలతోనే కొడతాం..

0
194

మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నతీరుగానే ఉందని విమర్శించారు. అంగన్‌వాడీల సెల్‌ఫోన్‌ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి గారూ దీనికి సిద్దమేనా అని సవాలు విసిరారు.

‎ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతుందని మంత్రి సీతక్క ఇచ్చిన వార్నింగ్‌పైనా సతీశ్‌ రెడ్డి కౌంటర్లు విసిరారు. మేం ఆధారాలతోనే కొడతాం.. మాకు చెప్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. అంగన్‌వాడీ మొబైల్‌ ఫోన్ల కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని పునరుద్ఘాటించారు. అంగన్‌వాడీ టీచర్లకు 5జీ ఫోన్లు ఇవ్వాలని కేంద్రం చెబితే.. 4జీ ఫోన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‎అంగన్‌వాడీ మొబైల్‌ ఫోన్ల కొనుగోళ్లలో నూటికి నూరు శాతం స్కామ్‌ జరిగిందని అన్నారు. కుంభకోణాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ బయటపెట్టే సరికి సీతక్క ఫ్రస్ట్రేషన్‌లో ఊగిపోతున్నారని అన్నారు. దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే అని విమర్శించారు.

Search
Categories
Read More
Telangana
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల.|
● పాత ఓటర్లు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాలి ● నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ● డిసెంబర్ 30న...
By Sidhu Maroju 2026-09-17 10:30:10 0 77
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు...
By Pagadala Venkateswar 2026-02-11 06:00:20 0 188
Andhra Pradesh
అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.
  అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం 18-04-2026 Sat 07:23 | Andhra...
By Pagadala Venkateswar 2026-04-18 04:15:17 0 145
Andhra Pradesh
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం మహిళలపై నేరాల...
By Pagadala Venkateswar 2026-03-13 07:34:20 0 233
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం...
By Kothuru Murali 2026-05-17 16:45:50 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com