TG :- DOST | దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ

0
251

DOST | రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఒక మే 14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్ల కేటాయింపు అనంతరం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 30వ తేదీ సీట్లు కేటాయిస్తారు. మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరగనుంది. జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత సీట్ల కేటాయింపు అనంతరం కూడా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియక పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Search
Categories
Read More
Media Academy
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today With technology revolutionizing communication, journalists...
By Media Academy 2025-05-03 12:41:11 0 4K
Telangana
కనాజిగూడలో కొత్త విద్యుత్ పోల్స్.|
"రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు.. స్థానికుల్లో హర్షం"...
By Sidhu Maroju 2026-07-13 09:35:55 0 145
Andhra Pradesh
సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి.
  సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి 09-04-2026 Thu 07:50 |...
By Pagadala Venkateswar 2026-04-09 04:44:24 0 190
Andhra Pradesh
ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన పీడీ శ్రీనివాస్ ప్రసాద్ గారు
కొండాపురం(M) పరిధిలోని చింతలదేవి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ప్రాజెక్ట్ డైరెక్టర్...
By VALLERU SIMHADRI 2026-09-10 14:34:17 0 194
Andhra Pradesh
మదనపల్లె లో బిసి సింహాగర్జన పోస్టర్లు ఆవిష్కరణ.
మదనపల్లె జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం, బీసీవై పార్టీ అధినేత బోడెం...
By Pagadala Venkateswar 2026-02-06 13:11:34 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com