" మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఈటల సందేశం.|

0
430

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైనిక్‌పురి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు గురువుగా, మార్గదర్శకుడిగా నిలిచిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. పూలే  ఆశయాలు, త్యాగాలు నేటి తరానికి మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

మహిళా విద్యకు తొలి పునాది వేసిన సావిత్రిబాయి పూలే  సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళలకు చదువు ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి, అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ఆడపిల్లలకు విద్యాబోధన చేసిన తొలి గురువుగా సావిత్రిబాయి నిలిచారని పేర్కొన్నారు.

మిలటరీ, స్పేస్, అడ్మినిస్ట్రేషన్ వంటి అన్ని రంగాల్లో మహిళలు ఎదుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ల సాధనలో కూడా సావిత్రిబాయి వేసిన పునాది ఎంతో ప్రాముఖ్యత కలిగిందని అన్నారు. దేశహితం కోసం మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి ఇది దారితీస్తుందని తెలిపారు.

సుమారు 200 ఏళ్ల క్రితం పుట్టిన ఈ మహానుభావులు భారతదేశానికి వెలుగు, స్ఫూర్తి ప్రసాదించిన గొప్ప వ్యక్తులని, వారి ఆశయాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. యువత వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేరెడ్మేట్ మాజీ కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి, మల్కాజ్‌గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్, వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మౌలాలి మాజీ కార్పొరేటర్ సునీత యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి, గోపు రమణ రెడ్డి, సీనియర్ నాయకులు వి.కే. మహేష్, మౌలాలి డివిజన్ అధ్యక్షులు శివ, బుల్లెట్ స్వప్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దారవీడు మండలం బద్వేడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య
పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య   దోర్నాల...
By Chennaiah Kati 2026-01-23 14:02:03 0 241
Telangana
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:37:05 0 224
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Accelerates Infrastructure Development Projects
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen public infrastructure through...
By Fathima Safa 2026-07-06 06:12:31 0 141
Andhra Pradesh
మదనపల్లె : షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా...
By Pagadala Venkateswar 2026-02-24 08:05:46 0 191
Telangana
"తెగిపడిన విద్యుత్ తీగలు.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నిలిచేవా రెండు ప్రాణాలు?|
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో శనివారం తెల్లవారుజామున...
By Sidhu Maroju 2026-06-13 06:14:48 0 417
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com