పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష.

0
146

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆయన ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా పీఎన్జీ వినియోగాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దేశిత లక్ష్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేరుకోవాలని తేల్చిచెప్పారు.

 

ఈ సమీక్షలో భాగంగా ‘దీపం’ పథకం లబ్ధిదారులను పీఎన్జీ వైపు ప్రోత్సహించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీపం లబ్ధిదారులు పీఎన్జీ కనెక్షన్‌కు మారితే, వారికి పథకం కింద అందే రాయితీ సొమ్మును యథావిధిగా వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ఈ విషయంపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, సంబంధిత ఉత్తర్వులను తక్షణమే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎన్జీ వాడకం సురక్షితమని, చౌక అని ప్రజలకు వివరించాలన్నారు.

 

కేంద్రమంత్రికి ఫోన్

 

ప్రస్తుతం గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులను అధిగమించామని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఇదే సమయంలో శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. 

 

కేంద్రం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు చెప్పడంతో, సమీక్ష సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి చంద్రబాబు ఫోన్ చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినందున, పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ అమ్మవారి శ్రీ చక్రం పూజకు గోశాల పాలు
శ్రీ అమ్మవారి శ్రీ చక్ర నవారాణార్చన పూజకు పోరంకి గోశాల పాలు: పత్రికా ప్రకటన     ...
By Rajini Kumari 2026-01-16 12:44:37 0 232
Andhra Pradesh
తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు...
By Pagadala Venkateswar 2026-04-23 03:42:31 0 136
Telangana
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన...
By Avunoori Mahesh 2026-06-02 05:29:56 0 174
Sports
FIFTY FOR JAISWAL! 🔥🔥🔥
His seventh 50+ score in just 12 innings against England! 💪 Will he convert this into another...
By Bharat Aawaz 2025-07-02 17:51:45 0 2K
Telangana
ప్రచార కార్యక్రమలపై నిషేదం : జిల్లా కలేక్తర్
మున్సిపాల్ ఎన్నికల పోలింగ్ ప్రాక్రియాణి పురస్కిరించికొని రాష్ట్రా ఎనికలసంగం నియమావళి అనుసరిస్తు...
By Sadaq Sadaq 2026-02-08 12:25:27 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com