శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|

0
282

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ నుంచి వెళ్లి ఐదేళ్లు అయినప్పటికీ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు” అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనను టిఆర్ఎస్ పార్టీ నుంచి పంపించడం తప్పు అని ప్రజల్లో చర్చ జరుగుతోందని, తాను ఎప్పుడూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో తనపై అన్యాయాలు జరిగాయని, భూములు, ఆస్తులపై ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, అబద్ధాలపై పాలన కొనసాగుతోందని అన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.
మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ...
By Pagadala Venkateswar 2026-06-26 03:22:31 0 122
Andhra Pradesh
దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు
పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం...
By Mobbu Venkatramana 2026-02-02 12:12:46 0 476
Telangana
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల...
By Pinnehasan Odela 2026-01-14 18:42:55 0 266
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల...
By Kothuru Murali 2026-02-23 12:26:19 0 450
Telangana
మంచిర్యాల్: వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్
కొనుగోలు కేంద్రం నుంచి వరి ధాన్యం వేగవంతంగా తరలించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్...
By Bonagiri RaviShankar 2026-05-24 23:15:57 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com