టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసన

0
251

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరి పట్టణం ఘాట్ రోడ్డు లోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. హైందవ ధర్మం పట్ల, తిరుమల సంప్రదాయాల పట్ల అవగాహన లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్ వంటి అత్యున్నత పదవిలో కొనసాగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. *బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ చేశారు*. ఈ నిరసన కార్యక్రమంలో మంగళగిరి టౌన్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వేణుగోపాల సోమి రెడ్డి, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివ గోపయ్య, మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మరియు నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగ అధ్యక్షులు మహిళ నాయకురాలు, శ్రేణులు పాల్గొన్నాయి.

Search
Categories
Read More
Telangana
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-04-28 13:09:15 0 650
Andhra Pradesh
ఎట్టకేలకు చింతూరులో దంచి కొడుతున్న వర్షం!
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఈరోజు సాయంకాలం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. గత నెల 20, 24, తేదీల్లో...
By Shyamala Yadagiri 2026-07-18 10:26:11 0 166
Andhra Pradesh
రైళ్లల్లో వీళ్ళకి టికెట్ అవసరం లేదు ఫ్రీగా జర్నీ
రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!   రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల...
By Rajini Kumari 2026-06-06 11:23:38 0 386
Andhra Pradesh
చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:01:03 0 368
Andhra Pradesh
వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.
అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్‌లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు...
By Pagadala Venkateswar 2026-02-14 05:57:27 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com