వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా

0
195

అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు

 

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి 

 

పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది : మాజీ మంత్రి దేవినేని ఉమా

 

విజయవాడ రూరల్ , గొల్లపూడి : 01 ఏప్రిల్ 2026

 

రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, దాన్ని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గొల్లపూడిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టి అని పేర్కొన్నారు. అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఎక్కడికక్కడ దాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.

 

సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే, గతంలో ప్రజలకు నష్టం కలిగించిన వైసీపీకి ఇప్పుడు వాటిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఇక సామాజిక సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఉమా స్పష్టం చేశారు. ఎన్నిఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతున్నారని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఎమ్మిగనూరు పట్టణంలోని గురు నవోదయ కోచింగ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి అని సోమప్ప సర్కిల్లోని...
By Boya Dasthagiri 2026-07-06 14:48:01 0 156
Andhra Pradesh
*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి...
By Vadlamudi NagaVenkat 2026-03-08 17:24:23 0 976
Andhra Pradesh
అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు...
By Gadiyapudi Narendra 2026-03-05 18:11:41 0 757
Telangana
నిజామాబాద్: రేపు పలు ఎరియలాలో విద్యుత్ అంతరాయం
33 కెవి లింక్ లైన్ కరణంగ రేపు(బుధవారం) ఉదయం 8 గం నుండి 11గంటల వారకు ఈ ప్రాంతలో విద్యుత్...
By Sadaq Sadaq 2026-03-31 18:02:31 0 205
Andhra Pradesh
​కూటమి పాలనలో గ్రంథాలయాలకు పూర్వవైభవం: వి. ఆర్ రాసాని.
ఆదివారం మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ వి. ఆర్...
By Pagadala Venkateswar 2026-06-08 09:23:30 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com