Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

0
84

Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

 

ఈ సందర్భంగా ముదివేడు క్రాస్‌కు చెందిన ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ముదివేడు పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆమెకు అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశించారు. ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం అక్కడున్న రోగులు, వారి కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆపరేషన్ క్లీన్ స్వీట్లు రెండవ వారానికి శ్రీకారం
విజయవాడ నగరపాలక సంస్థ 30-05-2026   *ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో రెండో వారానికి...
By Rajini Kumari 2026-05-30 12:09:04 0 145
Telangana
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన నిర్ణయం .|
అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు  ప్రభుత్వానికి ప్రకృతి వైద్య...
By Sidhu Maroju 2025-12-29 11:55:23 0 260
SURAKSHA
A. Akbar IPS: Leading Kerala Police with Courage & Vision
The Journey Begins "The true strength of a police officer lies not only in...
By Fathima Safa 2026-07-08 12:27:59 0 440
Andhra Pradesh
పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు...
By Shyamala Yadagiri 2026-07-18 11:16:06 0 184
Arunachal Pradesh
Environment and Forest Conservation in Arunachal Pradesh
Arunachal Pradesh, one of India’s most biodiverse states, continues to prioritize...
By Fathima Safa 2026-06-30 13:40:29 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com