ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.

0
1K

ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వరుసగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.గ్రామానికి చెందిన ఖాదర్ వలీ (72), అల్లావుద్దీన్ (69), మైద్దీన్ (62)లు కేవలం 16 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.మార్చి 18న అనారోగ్యంతో అల్లావుద్దీన్ మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక మరుసటి రోజు మార్చి 19న మైద్దీన్ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతరం ఇద్దరు తమ్ముళ్ల మృతితో తీవ్రంగా కలత చెందిన పెద్ద అన్న ఖాదర్ వలీ ఆదివారం (మార్చి 29) మృతి చెందడంతో ఈ విషాదం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.ఒకే కుటుంబంలో వరుసగా ముగ్గురు సోదరులు మరణించడం గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది. గ్రామస్తులు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నార్త్ జోన్ అకాడమీలో మీ 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ
Andhra Cricket Association (ACA) ఆధ్వర్యంలో నార్త్ జోన్ అకాడమీలో మే 14 నుంచి 17 వరకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-05-15 11:55:26 0 172
Telangana
మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు...
By Ponnala Srinivasrao 2026-03-15 01:16:27 0 319
Telangana
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో  ‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్  ‎ఒక కూతురు...
By Ponnala Srinivasrao 2026-05-10 02:06:17 0 153
Andhra Pradesh
సోమల మండలంలో గాలి వాన బీభత్సం
అన్నమయ్య జిల్లా, సోమల మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం...
By Kothuru Murali 2026-06-09 13:53:56 0 117
Telangana
పెద్దపల్లి వేసవి ప్రభావాలు అధిక ఉష్ణోగ్రతలు: వేసవిలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C వరకు చేరుకుంటాయి. గత ఏడాది సుల్తానాబాద్ వంటి ప్రాంతాల్లో 44.5°C నమోదైంది.
PEDDAPALLI 
By Sunka Santhosh 2026-03-26 05:45:21 0 346
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com