విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

0
253

పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి. ...........          

 

 

 భవానీపురం పోలీస్ కాలనీలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.. శనివారం ఆయన స్తానిక కూటమి నాయకులతో కలిసి 43 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 42, 43, 44, 45 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్ కు లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ రావడం, సరఫరాలో ఎగుడు దిగుడు సమస్యలు వస్తున్నాయి.. ఈ సమస్యలను అధికమించేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 6.2 కోట్ల హడ్కో నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం, రాబోయే వేసవి నీ దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరామనీ తెలిపారు. విద్యుత్ ను ఆదా చేస్తే. ఉత్పత్తి చేసినట్లే నని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలనీ కోరారు... ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా రామరాజ్యనగర్ సెక్షన్ పరిధిలోని 42, 43, 44, 45, డివిజన్ల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందనీ తెలిపారు.. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఈఈ కొండలరావు, డీఈ గోవిందరాజులు , మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, బుల్లా విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొలేపల్లి కోటేశ్వరరావు, బిజెపి మండలాద్యాక్షుడు పగడాల కృష్ణ, జనసేన నాయకురాలు తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు ఆలయ కమిటీ
ప్రకటన: ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు          ...
By Rajini Kumari 2025-12-30 10:46:20 0 261
BMA
Reporting in Jammu & Kashmir: The Fear of Daily Duty
Reporting in Jammu & Kashmir transforms everyday journalism into a high-stakes challenge....
By JoinBMA 2026-08-19 06:35:07 0 65
Andhra Pradesh
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్   టిడిపి...
By Rajini Kumari 2025-12-23 10:27:53 0 235
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 188
Telangana
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️
  మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా... ఆ పార్సిల్‌ను...
By Thalakayala Nagashiva 2026-06-05 11:40:44 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com