కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలు: సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ఆదేశం

0
274

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు రియు జిల్లా ఎస్పీ నితికా పంత్ IPS గారి  నేతృత్వంలో రాబోయే వర్షాకాలాన్ని పురస్కరించుకుని భారీ వర్షాలు, వరదలు మరియు ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో విపత్తు నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ప్రభుత్వ శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో కంట్రోల్ రూమ్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున విపత్తుల సమయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందాలను అవసరమైన లైఫ్ జాకెట్లు, బోట్లు, ఇతర రక్షణ సామాగ్రితో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రెవెన్యూ, పోలీస్, నీటి పారుదల (ఇరిగేషన్), పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, రహదారులు మరియు భవనాల (R&B), విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL), అగ్నిమాపక, మరియు సమాచార పౌర సంబంధాల శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు మరియు ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సమన్వయంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Search
Categories
Read More
Telangana
టాయిలెట్ నిర్మాణానికి రూపాయిలు 12000 ఇలా అప్లై చేసుకోండి..!
తెలంగాణ : స్వచ్ఛభారత్ మిషన్ -2 లో భాగంగా టాయిలెట్స్ లేని 2.19 లక్షల ఇళ్లకు వాటి నిర్మాణ కోసం...
By Sunka Santhosh 2026-04-10 07:10:46 0 254
Andhra Pradesh
సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ జనసేన
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో...
By Rajini Kumari 2026-01-11 09:46:32 0 214
Andhra Pradesh
తన భూమిని అక్రమంగా లాక్కున్నారని మాజీ సీఎంకు ఫిర్యాదు చేసిన మహిళ
02.04.2026 తాడేపల్లి   వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,...
By Rajini Kumari 2026-04-02 16:06:02 0 203
Andhra Pradesh
మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన
సత్యసాయి జిల్లా : మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో...
By Vinod Kumar 2026-09-11 14:29:51 0 201
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com