వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచనలు

0
694

చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని రోశయ్య కాలనీ రహదారిలో టూ టౌన్ సీఐ,బి,అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలునిర్వహించారు. తదుపరి వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అన్న విషయాలను పరిశీలించారు.అలాగే ఓవర్ స్పీడ్‌గా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మైనర్లు వాహనాలు నడపరాదని స్పష్టంగా హెచ్చరిస్తూ, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదని సూచించారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు నిర్వహించినట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ...
By Ratna Sekhar 2026-03-11 03:42:40 0 420
Andhra Pradesh
విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు
విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల...
By Boiena Rajesh 2026-03-23 04:11:20 0 244
BMA
Health Journalism: Press Exposes Pharma Scams Safely
Journalists investigating pharmaceutical price-gouging, unregulated clinical trials, and...
By JoinBMA 2026-08-21 08:12:13 0 168
Telangana
కాంగ్రెస్ "ఆరుగ్యారంటీలు" ప్రజలను వంచించేందుకే.. కప్పర వర ప్రసాద్ రావు.|
    హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను...
By Sidhu Maroju 2026-03-16 04:42:13 0 193
Andhra Pradesh
ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా...
By Benguluri Madhubabu 2026-03-09 09:54:19 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com