చేనేత కార్మిక పారిశ్రామిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ డిమాండ్.

0
580

 

 

*చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్ దగ్గర జరిగె మహా ధర్నాను జయప్రదం చేయండి* తెలంగాణ చేనేత కార్మిక సంఘం *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంత కుమార్ గారి విజ్ఞప్తి*

 రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంతి కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ముషం నరహరి గారు ఈరోజు *చేనేత పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ 2, పద్మానగర్, కరీంనగర్ లో ఆప్కో మాజీ డైరెక్టర్ అడిగోప్పుల శ్రీ సత్య నారాయణ గారు, ఊటూరు సహకార సంఘం అధ్యక్షులు శ్రీ ఊసకొయల రామ చంద్రం గారి* ఆధ్వర్యంలో చేనేత పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు మరియు చేనేత కార్మికుల సమావేశం జరిగిన సందర్భంగా హాజరై మాట్లాడుతూ  

 *చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించక పోవడంతో చాలా దారుణంగా* తయారయ్యాయని

   గతంలో చేనేత కార్మికులు ఎన్నో *పోరాటాల ఉద్యమాల ద్వారా సాధించుకున్న పథకాలనుఅనగా జాతీయ చేనేత బోర్డు. హ్యాండీ కాస్ట్ బోర్డు. మహాత్మాగాంధీ బోనకర్ భీమ యోజన ఐసిఐసిఐ లాంబార్ టు హెల్త్ స్కీమ్ హౌస్ కం వర్క్ షీట్ పథకాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని* 

   *కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ నుండి సరుకులు రంగులు రసాయనాలతోపాటు చేనేత చీరలపై జిఎస్టి విధించడం వల్ల చేనేత పరిశ్రమపై చావు దెబ్బ పడిందని* 

  మన రాష్ట్రంలో కాంగ్రెస్ *ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిన్నర అయిన గాని ఋణమాఫీ అమలు జరుగలేదు. 2025 నవంబర్ 20 వ తేదీన కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా ఫలితంగా రుణమాఫీ అయిందని.*

     *నేతన్న భరోసా పథకం ప్రకటించి రెండెండ్లు దాటినా అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,*

   *త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికుల అకౌంట్ లలో రెండు నెలలు జమ చేసి పది నెలల నుండి జమ చేయడం లేదు.* 

   *జియో టాగ్ ఉండి మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు రెండు ఏండ్లు దాటిన నేటికీ నేతన్న భీమ ఎక్స్గ్రేషియా నేటికీ రాలేదని,*

    దీనితోపాటు కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని,

      ఐదు లక్షల ఆరోగ్య భీమా సదుపాయం 

    చేనేత కార్మికులకు పెట్టుబడి సాయం కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని,

   చేనేత వస్త్రాలపైన ముడీ సరుకు పైన నూలు రంగులు రసాయనలపై మరియు చేనేత చీరల పైన జీరో జీఎస్టీ చేయాలని మాట్లాడడం జరిగింది 

  *2026 మార్చి 25 వ తేదీన హైదరాబాదులోని ఇంద్ర పార్క్ దగ్గర మహా ధర్నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చేనేత కార్మికులందరూ హాజరై జయప్రదం* చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో శ్రీపతి వెంకటేశం,శ్రీ శ్రీరాంపల్లి రమణ,శ్రీ చిలగాని శంకరయ్య, శ్రీ మంచికట్ల కోటేశ్వర్, శ్రీ చొప్పదండి జనార్థన్, శ్రీ బొమ్మకల్ చంద్ర మౌళి, నెంబర్ 2 ఆదర్శ సత్య నారాయణ, శ్రీ మైనాంపల్లి శ్రీనివాస్, శ్రీ కనుకుల రాములు, శ్రీ సిరిపురం అంజయ్య, శ్రీ కొత్తపల్లి రాజేశం పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా...
By Pagadala Venkateswar 2026-03-18 06:26:18 0 212
Andhra Pradesh
Madanapalle: ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చే నకిలీ వాట్సాప్ సందేశాలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరిక.
మదనపల్లె: ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) శాఖ పేరుతో వాట్సాప్‌లో వస్తున్న నకిలీ...
By Pagadala Venkateswar 2026-08-06 06:30:49 0 91
Andhra Pradesh
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన: ఫైర్ ఆఫీసర్ శివప్ప.
మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు...
By Pagadala Venkateswar 2026-02-27 04:05:22 0 166
Bharat Aawaz
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz. Change doesn't happen by watching from the sidelines. It happens...
By Bharat Aawaz 2025-07-08 18:42:41 0 2K
SURAKSHA
పఠాంచెరు పోలీసుల అంకితభావం: శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతర కృషి
సంగారెడ్డి జిల్లా పఠాంచెరు పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శాంతి భద్రతలను కాపాడటంలో...
By Kalaga Sailaja 2026-06-24 13:14:46 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com