250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra

0
544

-రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా

-2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

 

🔷రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం అత్తాపూర్‌లోని రాంబాగ్ స‌ర్వే నంబ‌రు 354/1, 354/2, 354/3ల‌లో 2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. చుట్టూ దేవాల‌యాలు.. మ‌ధ్య‌లో ప్ర‌భుత్వ భూమి ఉంది. ఈ భూమికి ఆనుకుని సిక్కుల‌కు సంబంధించిన స‌మాధి ఉంది. ఒక వైపు దేవాల‌యాల‌కు కేటాయించాల‌ని.. మ‌రో వ‌ర్గం సిక్కుల‌కు ఇవ్వాల‌ని స్థానికంగా ఎప్ప‌టి నుంచో వివాదం నెల‌కొని ఉంది. ఎవ‌రికి వారు త‌మ‌దంటూ వాధిస్తూ వ‌చ్చారు. ఇటీవ‌ల సిక్కులు త‌మ‌కు ఈ భూమిని కేటాయించాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ స్థ‌లం విష‌యంపై స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని జ‌న‌వ‌రి నెల 29న జిల్లా క‌లెక్ట‌ర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు గాను 3 నెల‌ల స‌మ‌యం ఇచ్చింది. ఈ లోగా సిక్కు మ‌త‌స్తులు 2.34 ఎక‌రాల చుట్టూ టిన్ షీట్ల‌తో ప్ర‌హ‌రీ నిర్మించి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వివాదం త‌లెత్తింది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

 

 -హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌..

🔷 మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలతో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు ఇటీవ‌ల ప‌రిశీలించారు. ఇరు వ‌ర్గాల‌తో మాట్లాడారు. సంబంధిత ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. రెవెన్యూ అధికారుల‌తో స‌మీక్షించారు. ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించారు. ఫెన్సింగ్ వేసి ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు ఆదివారం ఉద‌యం టిన్ షీట్ల‌తో వేసిన ప్ర‌హ‌రీని తొల‌గించారు. ఆ వెంట‌నే 2.34 ఎక‌రాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. అక్క‌డ ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా హైడ్రాతో క‌ల‌సి పోలీసులు, రెవెన్యూ అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. సిక్కుల స‌మాధి ఉన్న స్థ‌లం 366 గ‌జాల స్థ‌లాన్ని వ‌దిలిపెట్టి మిగ‌తా భూమి చుట్టూ ఫెన్సింగ్ శారు. దీంతో అక్క‌డ స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. ద‌శాబ్దాల స‌మ‌స్య‌కు హైడ్రా ప‌రిష్కారం చూప‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడిందంటూ కొనియాడారు.

 

#Swamy #Hydraa #Attapur #hyderabad #rajendranagar

Search
Categories
Read More
Telangana
Telangana Accelerates IT and Digital Economy Growth
Telangana continues to strengthen its position as one of India's leading technology hubs, with...
By Fathima Safa 2026-07-06 05:59:05 0 189
Telangana
చలో హైదరాబాద్ కు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు వినతి..
ఈనెల 10 న జరుగునున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఉద్యోగు, ఉపాధ్యాయులు పాల్గొన్నందుకు అనుమతి...
By Bonagiri RaviShankar 2026-09-08 20:40:52 0 129
Andhra Pradesh
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని...
By Pagadala Venkateswar 2026-03-10 08:47:12 0 312
Odisha
Odisha's ₹90,000 Crore Railway Infrastructure Boost
Odisha is currently undergoing a massive transformation in its railway connectivity, with...
By Lokeshwari Panthadi 2026-07-02 07:38:55 0 107
Andhra Pradesh
అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.
మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,. సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర...
By Yalakala Vasunaidu 2026-03-24 09:04:36 0 422
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com