సుభాష్ నగర్ UPHC కి సొంత భవనం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కి వినతి .|

0
200

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుభాష్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్వహణ కోసం ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డాక్టర్ నూరీన్ బేగం శనివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న కేంద్రం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్, వీరేష్, సదానంద్, ప్రభాకర్, మనోజ్, మమత, జీవిత, శ్రీలత, ఉమాదేవి మరియు ఆశా కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీస్...
By Pagadala Venkateswar 2026-05-15 05:27:22 0 130
Andhra Pradesh
మార్చి31న యధావిధిగా బ్యాంకులు
మార్చి 31న యధావిధిగా బ్యాంకులు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక...
By Chennaiah Kati 2026-02-09 04:54:02 0 304
SURAKSHA
K. Biju, IAS: Leading Kerala with Vision and Integrity
The Journey Begins "True leadership in public administration is measured by the positive...
By Fathima Safa 2026-07-15 14:00:57 0 132
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....
By Sidhu Maroju 2025-06-22 15:33:37 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com