Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.

0
258

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం

వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన సీఎం చంద్రబాబు

తొలి విడతగా రూ.300 కోట్ల నిధుల విడుదల

ఉగాదిలోగా మిగిలిన రూ.900 కోట్లు జమ చేస్తామని హామీ

ఏపీలోని కాలేజీ విద్యార్థులకు, యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. నెల రోజులుగా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. నిధులపై వడ్డీ కోత విధించాలన్న ప్రతిపాదనతో తలెత్తిన వివాదానికి సీఎం చంద్రబాబు జోక్యంతో తెరపడింది. ఎలాంటి కోతలు లేకుండా పూర్తి బకాయిలను విడుదల చేయాలని ఆయన ఆదేశించడంతో నిధుల విడుదల ప్రక్రియ మళ్లీ మొదలైంది.

 

వివరాల్లోకి వెళితే... 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు గత నెల 10న బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వో) జారీ చేసింది. అయితే, నిధులు విడుదల చేయడంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఓ మెలిక పెట్టారు. ప్రభుత్వం రుణం తెచ్చి ఈ బకాయిలు చెల్లిస్తున్నందున, ఆ రుణంపై పడే 7.5శాతం వడ్డీని (సుమారు రూ.90 కోట్లు) కాలేజీ యాజమాన్యాలే భరించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా కాలేజీలే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయాలని కోరారు.

 

అధికారుల ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలకు తామే వడ్డీ కట్టడమేంటని, రుణం తీసుకున్నట్లు ఎలా సంతకాలు చేస్తామని ప్రశ్నించాయి. ఈ వివాదం కారణంగా నిధుల విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పలు కాలేజీల యాజమాన్యాలు మెయిల్స్ ద్వారా నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశాయి. తమకు రావాల్సిన బకాయిలపై వడ్డీ విధించడం అన్యాయమని ఆయన దృష్టికి తీసుకెళ్లాయి.

 

ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ముఖ్య‌మంత్రి, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వడ్డీ ప్రతిపాదనను వెంటనే పక్కనపెట్టి, బకాయిలను యథాతథంగా విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్ర‌బాబు ఆదేశాలతో సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. తొలి విడతగా బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.300 కోట్ల నిధులను విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లను ఉగాది పండుగలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో కాలేజీ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకొని హర్షం వ్యక్తం చేశాయి. త్వరలోనే ఈ నిధులు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్....✍
By Rajini Kumari 2026-02-28 13:03:28 0 206
SURAKSHA
Shield of Courage: The Inspiring Journey of Kanta Jangid
Excellence at the Helm: The Inspiring Story of Smt. Kanta Jangid, IPS: Breaking glass ceilings...
By Kalaga Sailaja 2026-07-22 06:53:34 0 173
Andhra Pradesh
పుంగనూరులో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు
ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి...
By Kothuru Murali 2026-06-13 15:33:18 0 124
Telangana
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-09-23 16:01:54 0 507
Telangana
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా :  చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన...
By Avunoori Mahesh 2026-04-29 10:54:20 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com