Nara Lokesh: విశాఖలో 20 వేల ఉద్యోగాలు.. క్యాప్‌జెమినీకి మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన.

0
236

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్‌జెమినీని రాష్ట్రానికి ఆహ్వానించింది. విశాఖపట్నంలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమావేశమై కీలక చర్చలు జరిపారు. సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో విశాఖలో ఒక భారీ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ ప్రతిపాదించారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేశ్‌ వివరించారు. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రత్యేక ఐటీ ఎకోసిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

అంతేకాకుండా, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కో-డెవలప్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని లోకేశ్ కోరారు. ఏపీలో 'క్వాంటం వ్యాలీ' అభివృద్ధికి, డెడికేటెడ్ క్వాంటం వర్టికల్ స్థాపనకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదన.. క్యాప్‌జెమినీ సీఈవో సానుకూల స్పందన‌

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై క్యాప్‌జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ సానుకూలంగా స్పందించారు. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని తెలిపారు. భారత్‌లోని 13 నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయని వివరిస్తూ, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేశ్‌ కూడా పాల్గొన్నారు. క్యాప్‌జెమినీ సంస్థ వార్షికాదాయం సుమారు 23.9 బిలియన్ డాల‌ర్లు కావడం గమనార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి అడిషనల్...
By Pagadala Venkateswar 2026-04-14 06:53:32 0 181
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)
ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని...
By Vadlamudi NagaVenkat 2026-03-09 11:51:29 0 780
Telangana
రెండో రోజు గణపతి మండపాలకు సహకారం...
శ్రీ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు నగరంలోని గణపతి మండపాలకు...
By Sadaq Sadaq 2026-09-12 12:44:26 0 96
Telangana
హైకోర్టులో హైడ్రాకు షాక్ - బతుకమ్మ కుంట బోర్డులు తొలగించాలంటూ ఆదేశాలు .|
హైదరాబాద్‌లో హైడ్రాకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలోని...
By Sidhu Maroju 2026-03-17 17:14:37 0 261
Telangana
బొల్లారం ఆయుధాల చోరీ కేసును చేదించాం: డీజీపీ సివి ఆనంద్.|
● నలుగురు నిందితుల అరెస్ట్.. ప్రమాదకర ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ స్వాధీనం ●...
By Sidhu Maroju 2026-09-11 13:51:05 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com