Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

0
191

Andhra

 

CM Chandrababu Naidu Tours Nandyala District Today

డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయ‌నున్న సీఎం

కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్ర‌బాబు

స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

 

ఇవాళ‌ ఉదయం 10:00 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి, 11:20 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామ సభలో, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.

 

అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:40 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రోజంతా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:40 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి విద్యార్థులకు ప్రతిభను సాధించినందుకు పురస్కారాలు అందించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభను సాధించినటువంటి వాల్మీకి...
By Boya Dasthagiri 2026-06-07 13:17:20 0 228
Telangana
"దళిత సేవకు గౌరవం… క్రీడా ప్రతిభకు కీర్తి — విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సామాజిక సేవకు దక్కిన గౌరవం… క్రీడా ప్రతిభతో సాధించిన జాతీయ...
By Sidhu Maroju 2026-05-24 08:05:30 0 221
Andhra Pradesh
మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో...
By John Baji 2026-01-03 15:29:58 0 254
Telangana
నిజామాబాద్
5వ డివిజన్‌లో రూ. 1 కోటి 'పబ్లిక్ హెల్త్' నిధులతో నూతన C.C. రోడ్డు పనుల ప్రారంభం.ఈరోజు 5వ...
By Sadaq Sadaq 2026-08-14 07:33:03 0 109
Andhra Pradesh
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మాదకద్రవ్యాల...
By Pagadala Venkateswar 2026-06-24 04:08:45 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com