ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన.

0
113

 

ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన

10-06-2026 Wed 09:55

Andhra

Narendra Modi sets record as Prime Minister Chandrababu Naidu and Nara Lokesh react

సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన

సంక్షేమం, అభివృద్ధిని మోదీ సమన్వయం చేశారన్న సీఎం

వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మిస్తామని వెల్లడి

మోదీ ఘనత అనితరసాధ్యమని లోకేశ్ వ్యాఖ్య

మోదీ నాయకత్వంలో భారత్ అజేయశక్తిగా నిలిచిందని ప్రశంస

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుకున్న సందర్భంగా మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కేవలం దేశాన్ని పాలించడమే కాకుండా, దాని గతిని మార్చే కొద్దిమంది నేతల్లో మోదీ ఒకరని చంద్రబాబు కొనియాడారు.

 

గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4,399 రోజులు ప్రధానిగా సేవలందించారని, ఈ ప్రయాణంలో ప్రతి స్థాయిలో భారతదేశాన్ని మార్చడానికి విశేషంగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సామాన్యుడి జీవితం నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠ వరకు ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర ఉందని వివరించారు. "ఇంట్లోని మంచినీటి కుళాయి నుంచి చంద్రయాన్ విజయం వరకు, పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దులోని సైనికుడి ధైర్యం వరకు.. ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా మోదీ చూశారు" అని అన్నారు.

 

బలహీన వర్గాలకు మద్దతిస్తూనే, ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధికి బాటలు వేయడం ఆయన పాలనలోని ప్రత్యేకత అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వంలో నేడు భారతదేశం తన భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో, లక్ష్యాలపై మరింత ఆశావహ దృక్పథంతో ఉందని తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోదీకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. వికసిత భారత్ అనే మోదీ దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్రను నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

మోదీ రికార్డు అనితరసాధ్యం: నారా లోకేశ్  

 

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కొనసాగుతుండడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా ఎన్నికై, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా మోదీ నిలవడం చరిత్రాత్మకమని అన్నారు.

 

ఈ విషయంపై నారా లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి మోదీ నెలకొల్పిన ఈ రికార్డు అనితరసాధ్యం" అని కొనియాడారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అజేయశక్తిగా సగర్వంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

 

ప్రజలకు అవకాశాలు, గౌరవం కల్పించడంతో పాటు, దేశాన్ని స్వావలంబన, సాధికారత దిశగా నడిపించిన ఘనత మోదీకే దక్కుతుందని లోకేశ్ ప్రశంసించారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి జేజేలు పలుకుతున్నట్లు ఆయన తన ప్రకటనలో వివరించారు.

Search
Categories
Read More
Telangana
భయం లేని ట్రాక్టర్ డ్రైవర్స్
కులస్పూర్ గ్రామం లో యాదేచ్చగా కేజ్వెల్స్ తో సీసీ రోడ్ల పైనే టాక్ట్రాస్ నడుపుతున్నారు. ప్రభుత్వం...
By Chakrala Sadhanand 2026-08-04 05:14:26 0 395
Telangana
విదద్యార్థులకు పధకాల బావుకరణ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి
దంతాలపల్లి ఏప్రిల్ 23 మేజర్ న్యూస్ (భారత్ ఆవాజ్ )  దంతాలపల్లి మండలంలోని రేపోని ప్రాథమిక...
By Midathapalli Kiran Kumar 2026-04-24 01:18:12 0 503
Andhra Pradesh
చింతూరు లో విషాదం హెచ్ సి ఎల్ ఉద్యోగి మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి...
By Shyamala Yadagiri 2026-09-15 14:28:25 0 81
SURAKSHA
After Retirement: AP Police Fight Social Evils
Yesterday retire అయిన AP police officers సమాజంలోని evils తో పోరాడుతున్నారు. Child marriage...
By Kalaga Sailaja 2026-07-03 13:38:02 0 145
Andhra Pradesh
తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50...
By Ratna Sekhar 2026-03-05 18:14:19 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com