సూర్యోదయ సంస్థ సేవా స్ఫూర్తి – పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్ల పంపిణీ

0
814

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రభుత్వ హైస్కూల్లో సూర్యోదయ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 93 మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. సుర్ల నాగ రమణ – నాగమణి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కె. సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్య ద్వారానే జీవితంలో విజయాన్ని సాధించవచ్చని వారికి ప్రేరణ ఇచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న సూర్యోదయ సంస్థ ప్రతినిధులు విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భద్రరావు, సూర్యోదయ సంస్థ సెక్రటరీ రొంగల అర్జున్, వర్మ నాయుడు, ప్రసాద్, సురేష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేసి వారిని ప్రోత్సహించారు.

Search
Categories
Read More
Telangana
Alwal : save hindu graveyard
    GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
By Sidhu Maroju 2025-07-08 08:25:31 0 1K
Andhra Pradesh
ఎగ్జిబిషన్లో తనకి పశ్చిమ తహసిల్దార్ ఇన్చార్జి రిబ్కా రాణి
*విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*  *మంగళవారం*   *సితార...
By Rajini Kumari 2026-01-13 16:16:00 0 239
Andhra Pradesh
మదనపల్లెలో భార్యను వదిలేసిన భర్త… యువతి ఆత్మహత్యాయత్నం.
మదనపల్లెలో మంగళవారం, చంద్రాకాలనీలో అములు అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హేమంత్ అనే...
By Pagadala Venkateswar 2026-02-11 05:58:26 0 212
Andhra Pradesh
కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘కార్యకర్తలతో ముఖాముఖి’ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి...
By John Baji 2026-01-01 02:16:08 0 204
Andhra Pradesh
ఉదయగిరి ఆనకట్ట గోడలకు పగుళ్లు.. మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
ఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట...
By VALLERU SIMHADRI 2026-09-10 13:23:06 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com