*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*

0
975

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మరియు బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఐసిడిఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా గర్భిణులకు శ్రీమంతం మరియు మహిళామణులకు అభినందనల కార్యక్రమంలో పాల్గొని గర్భిణులకు శ్రీమంతపు కిట్లు అందజేసి ఆశీర్వదిస్తున్న బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.  

ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, మహిళలను గౌరవించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియ జేశారు. మహిళా దినోత్సవం అంటే కేవలం అభినందనలు తెలుపుకోవటం మాత్రమే కాదు అని, మహిళల అభివృద్ధికి పాటు పడుతూ, మహిళలను ప్రతి విషయంలో ప్రోత్సహించాలి అని తెలియ జేశారు. ప్రపంచ జీవనాడికి మూల కేంద్రమైన మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ మహిళా సాధికారత కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియ జేశారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు గా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు మరియు వారి టీమ్ సభ్యులు అందరూ సమాజ సేవా కార్యక్రమాలతో పాటు మహిళలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అద్భుతంగా స్పందించటం, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యునిగా తాండ్ర సాంబశివరావు సంతోషాన్ని వ్యక్త పరిచారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆర్డీఓ గ్లోరియా, బాపట్ల ఎమ్మార్వో సలీమా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారులు, బాపట్ల డి.ఎస్.పి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు శేష కుమారి, నాగమల్లీశ్వరి, శైలజ, అంగన్వాడి కార్యకర్తలు, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ టీమ్ సభ్యులు మరియు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సిద్దవటంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
సిద్ధవటం మండలంలోని భాకరాపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో 4 అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు దరఖాస్తులు...
By Pagadala Venkateswar 2026-03-31 03:38:53 0 187
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు |
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం కేసులో...
By Bharat Aawaz 2025-09-20 10:36:11 0 1K
Telangana
'ఏఆర్ కె కిచెన్ లైవ్ కాన్సెప్ట్' ప్రారంభించిన మైనంపల్లి
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.        అల్వాల్ లోని ఏఆర్ కె...
By Sidhu Maroju 2025-08-08 17:32:02 0 858
Andhra Pradesh
పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా...
By Kothuru Murali 2026-04-15 07:19:15 0 159
Andhra Pradesh
*శ్రీకాళహస్తిలో వైద్యం శాంతారాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన -కోట చంద్రశేఖర్*
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:19:57 0 827
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com