మార్చి మూడో తారీకు విలేకరుల సమావేశం జరిగింది

0
164

ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి                             

 

ఇరాన్‌పై దాడిని టిడిపి, వైసిపి ఖండించాలి

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

ఆలీన విధానానికి మోడీ తూట్లు పొడుస్తున్నారు

ఇరాన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

మార్చి 24న ఢిల్లీలో ప్రదర్శన బహిరంగ సభ 

అంగన్‌వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తగదు : వి.శ్రీనివాసరావు 

 

 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దుర్మార్గ£ంగా జరుపుతున్న దాడిని కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి, జనసేన కూటమి, ప్రతిపక్ష వైసిపి ఖండించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు కోరారు. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ కూటమి దాడిని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. అధికారంలో భాగస్వామిగా ఉన్న టిడిపి, కేంద్రంపై ఒత్తిడి చేయకుండా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అన్ని విధాలా మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష వైసిపి కూడా దీనిపై స్పందించ లేదని అన్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయిల్ నాయకత్వంతో మాట్లాడి వచ్చిన తరువాతే ఇరాన్‌పై దాడి జరిగిందని, దాడి గురించి ముందే మోడీకి తెలిసి ఉండాలని అన్నారు. బలమైన నిఘా వ్యవస్థ ఉందని చెబుతున్న కేంద్రం దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయిందో చెప్పాలన్నారు. లేక దాడి విషయం ముందే తెలిసి ఇజ్రాయిల్ ప్రధానిని కలిశారా? అదైనా బయటపెట్టాలన్నారు. ఇరాన్ అన్ని సందర్భాల్లోనూ భారత దేశానికి మంచి మిత్రుడిగా ఉందని, అయినా ఆ దేశ అధినాయకుడిని చంపేస్తే స్పందించకుండా యుఏఈలో అమెరికా ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేశారనే అంశంపై మాత్రమే స్పందించడం అన్యాయమని తెలిపారు. ఇరాన్‌పై దాడితో ప్రపంచ ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా ఇండియా పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడిని నిలిపేయాలని అన్ని దేశాలూ డిమాండు చేయాలని అన్నారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, సఫలమవుతున్నాయని అనుకున్న సమయంలోనే అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసి చర్చలకు విఘాతం కలిగించాయని అన్నారు. అప్రజాస్వామికంగా స్కూళ్లపై దాడిచేసి విద్యార్థులను చంపేసిందని తెలిపారు. తమపై దాడి చేస్తారనే ఉద్దేశంతోనే తాము దాడిచేశామని ట్రంప్ చెబుతున్న మాటలు అబద్ధాలని, ఇరాన్ అటువంటి ఆలోచనలు చేయడం లేదని పెంటగాన్ నివేదిక తెలిపినా దాడి చేశారని తెలిపారు. అయితే మోడీ దెబ్బతినిపోతున్న ఇరాన్ తరుపున కాకుండా దాడి చేస్తున్న దేశం తరుపున ` మిత్రులు, శత్రువులకు తేడా తెలియకుండా వ్యవహరించారని అన్నారు. ఈ విషయంలో అమెరికా వ్యూహంలో మోడీ భాగస్వామ్యం అయ్యారని, ఇజ్రాయిల్ తరుపున స్పందించి దేశ ప్రతిష్టను దిగజార్చారని తెలిపారు. ఇరాన్‌లో శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేశామని గతంలోనే చెప్పిన అమెరికా అదే సాకుతో ఇప్ప్పుడు దాడిచేయడం అమానుషం అన్నారు. 

 

మార్చి 24న ఢిల్లీలో నిరసన 

 కేంద్రం తీసుకొస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 24వ తేదీన సిపిఎం ఆధ్వర్యాన ఢిల్లీలో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నామని రాఘవులు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా చట్టాలు అమలు చేస్తోందని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తున్నామని అన్నారు. జీరాంజీ కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల పేదలు ఉపాధి కోల్పోయారని, దీన్ని ఉపసంహరించాలనేది ప్రధాన డిమాండని పేర్కొన్నారు. నాలుగు లేబర్‌కోడ్‌లు వెనక్కు తీసుకోవాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని, న్యూక్లియర్ లయబిలిటీ బిల్లునూ తీసుకువచ్చారని, వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండు చేస్తోందని పేర్కొన్నారు. ఇవి కాకుండా విదేశీ విత్తన కంపెనీల కోసం సీడ్‌బిల్లును తీసుకువస్తుందని అన్నారు. మరోవైపు అమెరికా 18 శాతం ట్యాక్సు విధించిందని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిపి మార్చి 24న డిల్లీలో కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. 

 

అంగన్‌వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపి జీతాల సమస్యను పరిష్కరిచండి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

 జీతాల పెంపుదల సహా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వేలాది మంది అంగన్‌వాడీలపై వారు నిద్రిస్తున్న సమయంలో బలవంతంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. మహిళలను వ్యానుల్లో ఎక్కించుకుని మగ పోలీసులు రాష్ట్రం నలుమూలలా తిప్పారని పేర్కొన్నారు. కాలకత్యాలు తీర్చుకునేందుకూ అవకాశం ఇవ్వకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారని తెలిపారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం చర్చించడానికి కూడా సిద్ధపడటం లేదని విమర్శించారు. గతంలో వైసిపి అధికారంలో ఉండగా ఇలాగే అర్థరాత్రి అరెస్టులు చేస్తే అన్యాయమన్న చంద్రబాబునాయుడు ఇప్ప్పుడు అదే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, వేతనాలపై అగ్రిమెంటు చేసుకోవాలని కోరారు. అంగన్‌వాడీల ఉద్యమానికి సిపిఎం తరుపున పూర్తి మద్దతు ప్రకటించారు. 

 

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

 రాజమహేంద్రవరంలో కల్తీపాలుతో అనేకమంది చనిపోయారని, పాల సరఫరా, మంచినీటి సరఫరాపై ప్రభుత్వం ఎటువంటి నిఘా, నియంత్రణా లేదని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళంలో డయేరియా వ్యాపించిందని, చాలా పట్టణాల్లో మురికినీరు పైపుల్లో సరఫరా అవుతోందని తెలిపారు. వీటిని తనిఖీలు చేసి సురక్షిత నీటిని సరఫరా చేయాలని, డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛభారత్ పేరుతో చేస్తున్న పనులన్నీ వందల కోట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకేనని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వి జి ఆర్ లాడ్జ్ ప్రారంభించిన మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి
ఈరోజు రాయచోటి పట్టణంలోని సుండుపల్లి బైపాస్ రోడ్డు నందు వల్లూరు వాసుదేవ రెడ్డి నూతనంగా నిర్మించిన...
By Benguluri Madhubabu 2026-02-26 11:04:47 0 221
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 198
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.
*ప్ర‌చుర‌ణార్థం* *11-01-2026*   తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న...
By Rajini Kumari 2026-01-11 09:35:20 0 195
SURAKSHA
K. K. Dwivedi: A Distinguished Career in Public Administration
A veteran Uttar Pradesh IAS officer whose decades of administrative service reflect dedication,...
By Kalaga Sailaja 2026-07-23 09:02:50 0 30
SURAKSHA
Pragya Richa Srivastava: Leading Emergency Response
A distinguished 1991-batch IPS officer of the Madhya Pradesh cadre, Shri Pragya Richa Srivastava...
By Lokeshwari Panthadi 2026-07-23 06:08:35 0 24
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com