వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్

1
1K

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, ఈ ఘటన అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచేసిందన్నారు.

బాణాసంచా కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం ప్రాంతంలో జరిగిన ఘటన మరువకముందే వేట్లపాలెంలో మరో దుర్ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

జిల్లాలోని ఫైర్‌వర్క్స్ యూనిట్లలో కార్మిక చట్టాలు, భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి, కొన్ని రోజుల తర్వాత మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ ప్రమాదంపై నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే ప్రమాద నివారణలో విఫలమైన సంబంధిత ఫైర్ స్టేషన్, రెవెన్యూ అధికారులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పులి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
. Modern Traffic Management Initiatives
​Content: Amid rapid urbanization, Karnataka Police has adopted various technical solutions to...
By Kalaga Sailaja 2026-06-29 11:02:47 0 166
Andhra Pradesh
మదనపల్లిలో పట్టపగలే భారీ చోరీ.
మదనపల్లెలో శుక్రవారం పట్టపగలే దొంగలు ఓ ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు....
By Pagadala Venkateswar 2026-01-31 05:44:18 0 183
SURAKSHA
Neerabh Kumar Prasad, IAS: Champion of Good Governance
A Leader Who Believes Development Begins with Empowering People "Inclusive growth is meaningful...
By Lokeshwari Panthadi 2026-07-13 13:18:18 0 131
SURAKSHA
WB Police Empowering Women Through Saurabh Teams
 To ensure the safety of women and students, the West Bengal Police has deployed the...
By Kalaga Sailaja 2026-06-27 07:22:31 0 97
Andhra Pradesh
కానిస్టేబుల్ మృతి: రూ 1 లక్ష సాయం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.
అన్నమయ్య జిల్లాలోని టి. సుండుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46)...
By Pagadala Venkateswar 2026-07-08 11:20:52 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com