శ్రీవారి లడ్డుపై నిజాల ఆవిష్కరణ

0
202

*📢 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాల ఆవిష్కరణ! 🙏*

 

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు

 

నేడు విజయవాడలోని లబ్బీపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద గల కళ్యాణ మండపంలో "హిందూ ధర్మ పరిరక్షణ వేదిక" మరియు సెంట్రల్ మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ వైసిపి ఇంచార్జ్ మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో శనివారం నాడు "తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాలు" శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన యథార్థాలను భక్తులకు తెలియజేస్తూ నిర్వహించిన సదస్సులో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది.

 

ఈ సందర్భంగా శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై వస్తున్న ఆరోపణలు, దేవాలయాల అభివృద్ధి అంశాలపై కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న విశిష్టతను మరియు దానికి సంబంధించిన వాస్తవాలను భక్తులకు వివరించారు. కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలలో ఎటువంటి వాస్తవాలు లేవని ల్యాబ్ రిపోర్టుల ద్వారా తేట తెల్లం అయిందని కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డు ప్రసాదం పై రాజకీయాలు చేసి భక్తుల మనోభావాలని దెబ్బ తీశారని కూటమి వైఖరి పై నిరసన వ్యక్తం చేసారు. 

 

లడ్డు వివాదం - రాజకీయ కుట్ర: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. కేవలం సొంత వ్యాపార ప్రయోజనాల కోసం (హెరిటేజ్ నెయ్యి విక్రయాల కోసం) మరియు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ఈ కల్తీ డ్రామా ఆడారని ఆరోపించారు.

 

దేవాలయాల అభివృద్ధిపై సవాల్: 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి, 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధికి పోలికే లేదని వెలంపల్లి పేర్కొన్నారు. కాణిపాక ఆలయ పునర్నిర్మాణం, గండి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి వంటివి జగన్ హయాంలోనే జరిగాయని గుర్తు చేస్తూ, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

 

చంద్రబాబుపై విమర్శలు: గతంలో విజయవాడలో హిందూ దేవాలయాలను కూల్చివేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని, వాటిని తిరిగి పునర్నిర్మించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

 

ఆచారాలపై ఎద్దేవా: జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆధ్యాత్మిక చైతన్యం వల్లనే, గతంలో బూట్లతో పూజలు చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్‌లు ఇప్పుడు కనీసం చెప్పులు విప్పి స్టేజీ ఎక్కే పరిస్థితికి వచ్చారని వెలంపల్లి ఎద్దేవా చేశారు.

 

కార్యక్రమ అడ్డంకులు: మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పవిత్ర కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించిందని, ఆటంకాలు సృష్టించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

హిందూ ధర్మ పరిరక్షణ కోసం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

🚩 ధర్మో రక్షతి రక్షితః 🚩

Search
Categories
Read More
SURAKSHA
Inclusion of Transgender Community in Recruitment
 Demonstrating a commitment to inclusivity, the Karnataka Police has reserved positions for...
By Kalaga Sailaja 2026-06-29 09:40:07 0 153
Karnataka
Karnataka Accelerates Aerospace and Defence Growth
Karnataka continues to strengthen its position as India's leading aerospace and defence...
By Fathima Safa 2026-06-27 11:41:35 0 159
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
By John Baji 2025-12-30 12:05:33 0 420
SURAKSHA
M. Dana Kishore, IAS: A Visionary Administrator Powering Telangana's Growth
The Administrator Who Believes Development Must Reach Every Citizen "Good governance is not...
By Lokeshwari Panthadi 2026-07-09 05:05:48 0 159
Andhra Pradesh
బి కొత్తకోట : యువతి అదృశ్యంపై కేసు నమోదు.
కొత్తకోటలోని బిసికాలనీలో మహమ్మద్ హుస్సేన్ కుమార్తె ఆర్షియా (18) అదృశ్యమైంది. ఇంటర్మీడియట్ వరకు...
By Pagadala Venkateswar 2026-02-08 11:09:42 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com