Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!

0
180

Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!

27-02-2026 Fri 12:03 | Andhra

AP High Court to Get Justice Lisa Gill as First Woman Chief Justice

కేంద్రానికి జస్టిస్ లీసా గిల్ పేరును సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

ప్రస్తుతం పంజాబ్ - హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లీసా

మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ పేరు సిఫారసు

 

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్ - హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

 

 

 

సాధారణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత కొత్తవారి నియామకం జరిగేది. కానీ, ఈసారి సుప్రీంకోర్టు కొలీజియం తన పనితీరులో కీలక మార్పు తెచ్చింది. ప్రస్తుత సీజేలు రిటైర్ కావడానికి రెండు నెలల ముందే వారి వారసుల పేర్లను కేంద్రానికి పంపిస్తోంది. న్యాయపాలనలో ఎక్కడా విరామం లేకుండా చూడటం, పరిపాలనాపరమైన జాప్యాన్ని నివారించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం.

 

 

 

మరోవైపు, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్...
By CM_ Krishna 2025-12-16 13:57:05 0 327
Telangana
మొక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ్ రెడ్డి గారు....
నెక్కొండ:  భారత్ అవాజ్ న్యూస్ :కేంద్రాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన...
By Gujile Ramu 2026-04-27 13:42:49 0 363
Telangana
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరెకుల సంఘం నాయకులు.,..
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన ఆరె సంక్షేమ సంఘం నాయకులు ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర...
By Gujile Ramu 2026-04-28 15:10:24 0 177
Andhra Pradesh
బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పించాలి: AISF.
మదనపల్లి బీటీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించాలని AISF మాజీ రాష్ట్ర కార్యదర్శి జల్లా...
By Pagadala Venkateswar 2026-06-08 15:54:26 0 122
Andhra Pradesh
బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో...
By Kothuru Murali 2026-05-28 18:40:53 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com