Drugs under control in police department

0
169

*గంజాయి రహిత సమాజమే లక్ష్యం – విశాఖ రేంజ్ పోలీసుల ఉక్కుపాదం:ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్* 

 

*భారీ స్థాయిలో గంజాయి నిర్మూలన మరియు గత 20 నెలల ప్రగతి నివేదిక.* 

 

అనకాపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 25, మేజర్ న్యూస్, 

విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి , అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్,అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ల తో కలిసి బుధవారం గంజాయి నిర్మూలనకు చేపట్టిన బహుముఖ వ్యూహాలను మరియు సాధించిన అద్భుత ఫలితాలను విలేకరుల సమావేశంలో వివరించారు. జూన్ 2024 నుండి జనవరి 2026 వరకు రేంజ్ వ్యాప్తంగా, అల్లూరి సీతారామరాజు ,అనకాపల్లి ,విజయనగరం, పార్వతీపురం ,శ్రీకాకుళం సాగిన గంజాయి వ్యతిరేక పోరాట వివరాలను వారు వివరించారు. అనంతరం జెఎన్ ఫార్మాసిటీలో గల రామ్ కి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద ఇన్సినరేషన్ పద్ధతిలో భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వాటిలో

అల్లూరి సీతారామరాజు జిల్లా 451 కేసులకు సంబంధించి 35,268.374 కిలోల గంజాయి, 132.157 లీటర్ల హషీష్ ఆయిల్.

*అనకాపల్లి జిల్లా:* 332 కేసులకు సంబంధించి 17,068.24 కిలోల గంజాయి, 10.03 లీటర్ల హషీష్ ఆయిల్. మొత్తం:అనకాపల్లి మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాలతో కలిపి 783 కేసులకు సంబంధించిన 52,336.614 కిలోల గంజాయి మరియు 142.187 మీటర్ల హసిష్ ఆయిల్ ను ధ్వంసం చేస్తారు.

 ఈసారి రికార్డు స్థాయి రికవరీ మరియు అరెస్టులు (జూన్ 2024 - జనవరి 2026)

​గత 20 నెలల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో గంజాయి స్మగ్లర్ల వెన్ను విరిచారు:

​మొత్తం కేసులు: 976 | అరెస్టులు: 2,405 మంది.

​స్వాధీనం చేసుకున్న గంజాయి: 55,346.292 కిలోలు.

​హషీష్ ఆయిల్: 56.275 కిలోలు.

​సీజ్ చేసిన వాహనాలు: 685.

​ముఠాల గుట్టురట్టు: 24 అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించి, 129 మంది సభ్యులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. గంజాయి నేరస్థల ఆర్థిక మూలాల పై దెబ్బ – రూ. 9.19 కోట్ల ఆస్తుల జప్తు* 

​మత్తు పదార్థాల వ్యాపారం ద్వారా గడించిన అక్రమ ఆస్తులపై ఎన్ డి పి ఎస్ చట్టం కింద వేటు వేసేమన్నారు. ఇప్పటివరకు 14 మంది ప్రధాన నిందితులకు సంబంధించి రూ. 9,19,17,290 విలువైన ఆస్తులను గుర్తించి, వాటిని ఫ్రీజ్ చేస్తూ కన్ఫర్మేషన్ ఉత్తర్వులు జారీ చేసామని తెలిపారు.కఠిన చట్టాల ప్రయోగం సాంకేతిక నిఘా* పిట్ ఎన్ డి పి ఎస్ అలవాటు పడ్డ నేరస్థులపై 92 ప్రతిపాదనలు సిద్ధం చేయగా, 34 డిటెన్షన్ ఆర్డర్లు అమలయ్యాయి. 1599 మందిపై హిస్టరీ షీట్లు తెరిచామని అన్నారు.

​డ్రోన్ నిఘా: 33 అత్యాధునిక డ్రోన్ల ద్వారా 129 హాట్‌స్పాట్‌లపై 1360 సార్లు నిఘా పెట్టి, నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

​సాంకేతికత: నేరస్థుల డేటా ట్రాకింగ్ కోసం, కోజ్ నిదాన్ మరియు నాట్ గ్రిడ్ వంటి యాప్‌లను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.

 సామాజిక మార్పు – డీ-అడిక్షన్ & ప్రత్యామ్నాయ పంటలు* 

​పోలీసు యంత్రాంగం కేవలం శిక్షలకే పరిమితం కాకుండా, బాధితులకు పునరావాసం కల్పిస్తోంది:​పునరావాసం: 6 డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా 401 మంది బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి, 244 మందిని కేంద్రాలకు పంపారు.

​రైతులకు ప్రోత్సాహం: గంజాయి సాగు మాన్పించి, 29,840 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయించేలా 1.59 కోట్ల మొక్కలను పంపిణీ చేసామని అన్నారు . కార్యక్రమంలో చివరగా

"యువత తమ బంగారు భవిష్యత్తును మత్తుకు బలి చేయవద్దు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలి. సమాచారం కోసం 1972 ( ఈగల్ టోల్ ఫ్రీ) లేదా 1933 నంబర్లను సంప్రదించండి. మీ వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయనీ ఆ న్నారు. ఐజీ గోపీనాథ్ జట్టి,

ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్,

 వి.విష్ణు స్వరూప్, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు మరియు పరవాడ ఇన్స్పెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ ఎస్.బాల సూర్యరావు, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు....
By Boiena Rajesh 2026-03-02 14:48:45 0 215
Andhra Pradesh
టెన్త్ పరీక్షా కేంద్రాల తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం...
By Boiena Rajesh 2026-03-16 14:19:18 0 246
Andhra Pradesh
ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
 నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన...
By Boya Dasthagiri 2026-09-05 14:52:42 0 166
Andhra Pradesh
మదనపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నాగేష్ బాధ్యతలు స్వీకరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా లక్కీ టైల్స్ మాల్ నాగేష్ శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:50:40 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com