ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం

0
128

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ వీరభద్ర గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు గఫూర్ ఏఐఎస్ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి షాహిద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రం విద్యా రంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల విద్య వరకు అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించక దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వార్డెన్ పోస్టులు భర్తీ కాకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయని డిగ్రీ బీటెక్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్ చేతికి రాక కళాశాల చుట్టూ తిరుగుతున్నారని రాష్ట్రంలో 6400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండిపోవడం వలన దిక్కుతోచని స్థితిలో విద్యార్థులను నిట్టేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్,డిగ్రీ,పాలిటెక్నికల్ ఐటిఐ. కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తేవాలని కోరారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను గాలికి వదిలేసి నిధులు కేటాయించక విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు డిపార్ట్మెంట్లను క్లోజ్ చేస్తున్నారని యూనివర్స్ లో టీచింగ్ నాల్ టీచింగ్ పోస్టులు మూడు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవు తుందని. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకునే కలలు కొంటున్న విద్యార్థులకు జీవో నెంబర్ 77 వలన వారికి ఫీజు రీయంబర్స్మెంట్ వర్తించకపోవడం చాలా వరకు పీజీ కళాశాలలు మూతపడడం వలన విద్యార్థులు ఉన్నత విద్య కు దూరమవుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అధికారంలోనికి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే పట్టకపోవడం విద్యార్థులను మోసం చేయడమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు ప్రతాప్, వీరేష్, సలాం భాష, సురేష్, మణి,తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం   మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి,...
By Rajini Kumari 2026-05-07 08:22:59 0 175
Telangana
ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న...
By Sidhu Maroju 2025-06-27 09:34:05 0 1K
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 149
Andhra Pradesh
మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు
మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు  సామాన్య కుటుంబం నుంచి...
By Chennaiah Kati 2026-06-17 00:48:03 0 102
Andhra Pradesh
సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తిని కాపాడిన పుంగనూరు పోలీసులు
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (42) అప్పుల బాధతో మంగళవారం...
By Kothuru Murali 2026-05-06 10:16:42 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com