గూడెం సత్య నారాయణ స్వామి గుడికి 50 కోట్లు మంజూరు సందర్బంగా పత్రిక సమావేశం

0
189

మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.58 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా గూడెం గుట్టపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పత్రికా సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతు గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు,రేపు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వస్తున్నారని తెలిపారు,గోదావరి పుష్కరాల దృష్ట్యా గూడెం దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని, రూ.58 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణం, స్నాన ఘట్టాలు, తాగునీటి సదుపాయాలు, వసతి గృహాలు, క్యూలైన్లు, దేవాలయ సుందరీకరణ, యాత్రికులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు,గూడెం దేవాలయ అభివృద్ధి పూర్తయితే ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు,అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దర్శించుకున్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ రాములు, గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయ ఈఓ శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేషన్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,DCP భాస్కర్, ACP ప్రకాష్ , సంబంధిత శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
SURAKSHA
Goa Police Beach Safety Teams Save Tourists from Drowning Daily
 Goa Police Beach Safety Teams patrol Calangute, Baga and Miramar beaches to prevent...
By Kalaga Sailaja 2026-07-03 06:19:54 0 118
Andhra Pradesh
అయోధ్య రామయ్య చెంతన సీఎం చంద్రబాబు నాయుడు గారు
 అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-28 10:09:17 0 199
Telangana
పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన వీడ్కోలు
నిజామాబాద్ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన కె. గంగాధర్ గౌడ్ (ASI),...
By Sadaq Sadaq 2026-08-31 17:12:54 0 89
Telangana
భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే
జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు        ...
By Bheeshman King 2026-07-03 12:28:03 0 124
Andhra Pradesh
పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు
పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-11 13:15:56 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com