రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక

0
1K

రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరో 500 టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 4,924 టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. అదనంగా 207 లీటర్ల నానో యూరియా కూడా అందుబాటులో ఉందని చెప్పారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేటు డీలర్ల ద్వారా యూరియాను సరఫరా చేయనున్నట్లు వివరించారు. రైతులు అధికారిక కేంద్రాల ద్వారా మాత్రమే ఎరువులను కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రబీ పంటల సాగులో అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బిజెపి అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*విజయవాడ*  సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ...
By Rajini Kumari 2026-01-10 12:51:40 0 221
Andhra Pradesh
అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి...
By Pagadala Venkateswar 2026-04-27 05:37:29 0 121
Andhra Pradesh
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య* .
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య*  ఏపీ – మంగళగిరి...
By Chennaiah Kati 2026-02-20 04:56:44 0 287
Andhra Pradesh
Nara Lokesh: పవన్ తో అనుబంధం, కాలేజీ రోజుల గురించి... విద్యార్థుల ప్రశ్నలకు నారా లోకేశ్ జవాబులు.
Nara Lokesh: పవన్ తో అనుబంధం, కాలేజీ రోజుల గురించి... విద్యార్థుల ప్రశ్నలకు నారా లోకేశ్ జవాబులు...
By Pagadala Venkateswar 2026-01-31 06:35:26 0 226
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ
పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ...
By Kothuru Murali 2026-02-26 12:57:29 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com