యూట్యూబ్ చూసి గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకులు
Posted 2026-07-07 04:36:42
0
94
AP: విశాఖపట్నంలోని పెందుర్తిలో జూన్ 27వ తేదీ సాయంత్రం 68 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు గొలుసు, తాళిని స్కూటీపై వచ్చిన తల్లీకొడుకులు దొంగిలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను విశాఖలోని రామా టాకీస్ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మీ, అక్షిత్‌లుగా గుర్తించారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడి, అప్పులపాలైన ధనలక్ష్మీ, సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం యూట్యూబ్‌లో వెతికి, ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు 'గో టూ బ్యాక్' విధానంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, నిందితులు బయలుదేరిన ఇంటిని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తల్లీకొడుకులు జైలుపాలయ్యారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గర్భిణీ అని చూడకుండా అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటివేశారు.
అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణీ అయిన తనను భర్త ఇంట్లో నుంచి గెంటివేశాడని మదనపల్లె జిల్లాకు...
Amnesty Report Warns of Dissent Criminalization in India
A mid-2026 human rights report jointly released by Amnesty International and the Civicus Monitor...
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
. షీ టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ
మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. నిన్న క్షేత్రస్థాయిలో షీ...
మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు*
...