పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే భాగ్యవతి అనే మహిళ అరెస్టు చేసిన ACP జి.కృష్ణ తెలిపారు. ఆమె నుంచి 2 లక్షల విలువైన 4.05 Kgs ఎండు గంజాయి, మొబైల్ స్వాధీనం చేసుకున్నమన్నారు. నాగపూర్ నుంచి తక్కువ ధరకు కొని గోదావరిఖనిలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణ తేలింది. నిందితురాలని పట్టుకున్న SI లక్ష్మణరావు, నరేష్ సిబ్బందిని ACP అభినందించారు.
ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష 2026 ఫలితాలు రేపు గురువారం విడుదల కానున్నాయి. జనరల్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఈ ఫలితాలను ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోవద్దని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐ.పి.ఎస్ గారు పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ (Arrive Alive) ప్రచారంలో భాగంగా బుధవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు...
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది నీతి, నిజాయితీలతో పాటు పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో కీలక సమీక్ష...
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైశ్వధ్యాలయాలో పీజీ కోర్సు లో ప్రవేశల కోసం నిర్వహించే టీజీసీపీ్గేట్ - 26 ఆన్లైన్ ధరఖాస్తు గడవును పొడిగేంచినట్టు కానివినర్ కే. రాజేందర్ తెలిపారు. అభ్యధ్రులు ఎలాంటి ఆపారాధ రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిపించినట్టు పేర్కొన్నారు. ఆర్హులైన అభ్యర్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు..
...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మండలంలోని వీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల అభ్యాస స్థాయి తక్కువగా ఉండటం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, పారిశుధ్య లోపాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన సేవలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన...
మదనపల్లి మండలం మాలేపాడులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ కారణంగా, బుధవారం 13 పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు, ముళ్లకంపలు వేసి రాకపోకలను స్తంభింపజేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి ఈ రోడ్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. 2004లో నిమ్మనపల్లె మండలం బాలినాయునిపల్లికి చెందిన దేవరాజ్‌తో వివాహం జరిగిందని, పెళ్లైన నాలుగు రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తన భర్త బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు పేర్కొంటూ వరకట్న వేధింపుల కేసును పోలీసులు...
మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం టమాటా ధరలు నిలకడగా కొనసాగాయి. రైతులు 1,440 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తరలించారు. నాణ్యమైన మొదటి రకం 10 కిలోల పెట్టె రూ. 340 (కిలో రూ. 34)కు అమ్ముడైంది. రెండో రకం పెట్టె రూ. 320, మూడో రకం రూ. 270కు చేరింది. మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరాం, కార్యదర్శి జగదీశ్ ఈ వివరాలను వెల్లడించారు.
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధి-2కు చెందిన డి. శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ తమ తాత స్వాతంత్ర్య సమరయోధుడు డి. మునిస్వామికి చెందిన వంశపారంపర్య స్థలాన్ని స్వర్ణలత అనే మహిళ ఆక్రమించిందని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తమ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.