మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో డిజిటల్ పద్ధతిలో జరగబోయే ఈ మహానాడులో పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.
మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తనపై బూటు కాళ్లతో దాడి చేశారని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా, బాధితుడిని పరామర్శించి, సీఐ చర్యను తీవ్రంగా ఖండించారు. సీఐ చర్యకు నిరసనగా గ్రామస్తులు వేంపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ. 21 కోట్లు మంజూరు చేసింది. అమృత్ 2.0 పథకం కింద, వాటర్ ఇంప్రూవ్‌మెంట్ స్కీం కోసం చిప్పిలి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ సప్లై పనులకు మంగళవారం భూమి పూజ జరిగింది. ఈ పనులను జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శివ నారాయణ శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, పాత లీజుదారులు సిండికేట్‌గా మారి, బినామీల పేర్లతో పదుల సంఖ్యలో షాపులు దక్కించుకుని మూడో వ్యక్తికి సబ్-లీజుకు ఇస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లను సొంత పేర్లకు మార్చుకున్నారని తెలిపారు....
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె మున్సిపల్ డంప్ యార్డ్ వద్ద రూ. 6.4 కోట్లతో తడి-పొడి చెత్తను వేరు చేసే కంపోస్ట్ బిల్డింగుల నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం భూమి పూజ చేశారు. జేసీ శివ నారాయణ శర్మతో కలిసి ఆయన ఈ పనులను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు...
అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె జెడ్పీ గ్రౌండ్‌లో మంగళవారం సీనియర్ మెన్ జిల్లా జట్టు ఎంపికలు జరిగాయి. ఈ ట్రయల్స్‌లో 50 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 30 మందిని ప్రత్యేక కోచింగ్ క్యాంప్‌నకు ఎంపిక చేశారు. క్యాంప్ అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు తుది 20 మందితో జట్టును ప్రకటించనున్నారు. టీడీపీ యువ నాయకుడు జునైద్ అక్బరీ, జిల్లా క్రీడా...
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు
27-05-2026 Wed 11:49 | Andhra
Chandrababu Naidu Focuses on State Reconstruction at Mahanadu
మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
ఎన్నికల నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహణ
టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకున్న సీఎం
రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ,...
అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు
Andhra
Chandrababu Naidu Launches TDP Mahanadu 2026 in Amaravati
అమరావతిలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026 వేడుకలు
పూర్తిగా వర్చువల్ విధానంలో, సాంకేతికత సాయంతో నిర్వహిస్తున్న సభలు
ఈ ఏడాది ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత
మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్న...
రోడ్లపై LED లైట్ల టార్చర్.. వాహనాలకు LED లైట్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న ప్రజలు. అయినా ఈ ప్రభుత్వానికి ఈ సమస్య కనపడటం లేదా? వినపడటం లేదా? రోడ్లపై తిరిగి వాహనాలకు చలాన్లు రాసే అధికారులకు, పోలీసులకు ఈ సమస్య కనపడటం లేదా? ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు సిరియస్ తీసుకోవడం లేదు? సోషల్ మీడియాలో జనం గగ్గోలు పెడుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు మౌనం...
కర్నూలు జిల్లాలోని జులై 1 నుండి 4 వరకు కర్నూలు నగరంలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి.సి ఆర్ భవన్ నందు కరపత్రల ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జూలై 1 నుండి 4 వరకు కర్నూల్ నగరంలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని స్థానిక సిఆర్ భవనం నందు కరపత్రాన్ని ఆవిష్కరించారు, ఈ...