Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది : డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ...
    615 Views
  • నిజామాబాద్
    రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 కార్యక్రమంలో భాగంగా నందిపేట్ గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం నిర్మించనున్న గ్రామ సంఘం (వీవో బిల్డింగ్) భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.   ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం గారు హాజరై భూమిపూజ నిర్వహించారు. అలాగే ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు రిమ్మ రవి, కంతం...
    223 Views
  • నిజామాబాద్
    తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వర్ధన్ హాస్పిటల్‌లో డా. సృజిల్ బాబు తేడ్డు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి ఉచిత వైద్య...
    184 Views
  • అంబరాన్నంటిన రెండో రోజు 'రేలా' సంబురాలు.. గిరిజన కళా ప్రదర్శనలు అద్భుతం: కలెక్టర్ దినేష్ కుమార్!
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'రేలా' గిరిజన ఉత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా సాగాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి పర్యవేక్షణలో అధికారికంగా ప్రారంభమైన ఈ వేడుకలు, అడవితల్లి ఒడిలో గిరిజన సంస్కృతి వైభవానికి అద్దం పట్టాయి.సాధారణంగా ఇలాంటి భారీ గిరిజన కళా ఉత్సవాలు ఈశాన్య భారతదేశంలో (North-East States) ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే, మన ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా లో...
    360 Views
  • లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA.
    మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం సహాయ నిధి (CMRF) కింద రూ. 4,10,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా చెక్కులను అందజేశారు. తమ ఇంటి వద్దకే వచ్చి సాయం అందించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
    343 Views
  • ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ.
    మదనపల్లిలో బక్రీద్ పండుగ సందర్భంగా డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు. హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యంతో, సమన్వయంతో పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
    243 Views
  • FFC ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించిన సీఎం.
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి సోమవారం మొలకలదిన్నెలో ఎఫ్‌ఎఫ్‌సీ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరి సమక్షంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
    224 Views
  • "మంగాపురం పార్క్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీ పార్క్‌లో సోమవారం సాయంత్రం “మీ సురక్ష” యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని ఎస్‌హెచ్‌వో ప్రశాంత్ మరియు సెక్టార్ ఎస్‌ఐ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ నివాసితులకు “మీ సురక్ష” యాప్ వినియోగంపై వివరంగా అవగాహన...
    416 Views
  • అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
    మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, సీనియర్ నేత రాటకొండ మధుబాబు, పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు సోమవారం మదనపల్లె కోర్టులో వాయిదాకు హాజరయ్యారు. అప్పట్లో జిల్లా కోసం పోరాడితే అప్పటి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందని, నాటి నుంచి నేటి వరకు ప్రతి నెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
    342 Views
  • వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి: జిల్లా కలెక్టర్.
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరులను పెంచాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లిలో ఇరిగేషన్, డ్వామా అధికారులతో నిర్వహించిన సమీక్షలో, ఈ ఏడాది 5 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వర్షపు నీటిని చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. వృథా ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించాలని, ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ ఛానల్స్...
    200 Views