Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
    తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ అధికంగా డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. దీంతో వడదెబ్బకు గురై ఒకరోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నాలుగైదు రోజులు ఎండలో తీవ్రత ఉంటుందని వాతావరణంలో హెచ్చరిస్తున్నారు. ఖమ్మం నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
    356 Views
  • పుంగనూరు నియోజకవర్గ : రొంపిచర్ల పెను ప్రమాదం
    బుధవారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పీలేరుకు బయలుదేరిన పల్లె వెలుగు బస్సు రొంపిచర్ల క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ముందు చక్రం ఊడిపోయింది. ప్రయాణికులు ఆందోళనకు గురైనప్పటికీ, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కనే ఆపడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు# కొత్తూరు మురళి .
    213 Views
  • పుంగనూరు: వర్షపు నీటి వివాదంలో గొడవ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఎల్లారు బయలు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శశి కుమార్ పొలం నుంచి రామస్వామి పొలంలోకి నీరు చేరడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రామస్వామి, నరసింహులు కలిసి శశి కుమార్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన శశి కుమార్ బుధవారం పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు# కొత్తూరు మురళి.
    214 Views
  • పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి. ఏడాది నుంచి మూడేళ్ల వయసున్న పొట్టేళ్లను రైతులు తీసుకురావడంతో సంతంతా వాటితో నిండిపోయింది. బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ కోసం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పొట్టేళ్లకు మంచి గిరాకీ ఏర్పడటంతో, ధరలు 35వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పొట్టేళ్లకు అధిక ధర...
    201 Views
  • రాజాపేట లో రాజీవ్ గాంధీ కి ఘన నివాళి
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 21-05-2026గురువారం మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ nsui  మహిళ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
    288 Views
  • " ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
    హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక వ్యాసం.   తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఒక ఐపీఎస్ అధికారి యూనిఫామ్ విడిచి, ఖద్దరు కండువా కప్పుకోవడం ఒకప్పుడు పెద్ద సంచలనం.  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీగా ‘స్వేరోస్’ అనే ఒక బలమైన సామాజిక సామ్రాజ్యాన్ని నిర్మించి, వేలాది మంది నిరుపేద విద్యార్థుల గుండెల్లో ఆశలు నింపిన వ్యక్తి...
    827 Views
  • పుంగనూరు: యోగ తో మానసిక ప్రశాంతత: సీఐ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ బసవరాజ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సుబ్బరాయుడు, యోగా శిక్షకుడు శివశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హార్డ్ ఫుల్ మెడిటేషన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి, ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి సీఐ సాయి ప్రసాద్, పోలీస్...
    205 Views
  • పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పుంగనూరు అధ్యక్షులు మునాఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను అరియర్స్ మరియు లీవ్ ఎన్ క్యాష్ మెంట్...
    221 Views
  • పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
    పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వస్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనం ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారంతా కలికిరి గుట్టపల్లికి చెందినవారు, అత్తగారింటికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....
    198 Views
  • సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
    మంచిర్యాల కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరగనుంది రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సభాస స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    300 Views