Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
    నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా...నల్లబెల్లి మండలం మేడపల్లి క్రాస్ వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పకు రక్షణగా రైతు పెట్టిన రాళ్లను గమనించని వాహనదారుడు బలంగా ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపుతప్పి కింద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని...
    245 Views
  • ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!
    ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి భారత్ అవాజ్ న్యూస్:12 మే ఈరోజున  TG: ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని CM రేవంత్ అధికారులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత రాకుండా చూసుకోవాలన్నారు. ఒప్పందం మేరకు లారీలను అందుబాటులో ఉంచని...
    254 Views
  • "సంచలన జర్నలిజం కంటే బాధ్యతాయుత జర్నలిజం గొప్పది.|
    హైదరాబాద్ : మీడియా ట్రయల్స్, సోషల్ మీడియా ప్రచారం, కుటుంబాల మానసిక క్షోభపై ఒక విశ్లేషణ. ఈరోజుల్లో ఒక కేసు బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, డిజిటల్ మీడియా వేదికలు, రాజకీయ పేజీలు తీర్పులు చెప్పే స్థాయికి చేరుకున్నాయి.  విచారణ ప్రారంభం కాకముందే “ఇతనే తప్పు చేశాడు”, “వాళ్ల కుటుంబం ఇలా ఉంది”, “అధికారాలు అడ్డుపడుతున్నాయి” అనే...
    425 Views
  • ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు శ్రీకారం
    ఎమ్మిగనూరు పట్టణంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడి పై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్య దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.
    339 Views
  • "దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
    హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర...
    892 Views
  • "అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక...
    334 Views
  • *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి*

    *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి*

    పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
    కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    2.8K Views
  • Chandra Babu Naidu nara lokesh visit assam
    అసోం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా సభా ప్రాంగణంలో పలువురు ఎన్డీఏ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సరదాగా సంభాషించారు. #HimantaBiswaSarma 
    268 Views
  • నందవరం మండల కేంద్రంలోని హనుమాన్ వేడుకలు
    నందవరం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే బాన సంచరాలతో గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ పాల్గొనడం జరిగింది.
    289 Views