Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
    గుర్రంకొండ రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు మదనపల్లెలోని చిప్పిలిలో రోడ్డు దాటుతుండగా, కర్ణాటక నుంచి వస్తున్న నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లికి చెందిన మంజు, సుదర్సన్ బైక్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
    239 Views
  • డాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలికి తీవ్రగాయాలు.
    శుక్రవారం మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    235 Views
  • ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.
    మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌కు శుక్రవారం 2వ ఏడీజే కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. గుట్టవారిపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ నిర్మాణ సమయంలో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ఇద్దరు కూలీలు ఈ దుర్ఘటనలో మరణించారు. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది.
    227 Views
  • రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.
    మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి చేశాయి. పొలంలో కూరగాయ పంటలకు నీరు మళ్లిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన రెడ్డప్పను కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
    245 Views
  • తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు
    RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు JAC నాయకులు వెల్లడించారు. ఈ చర్చలో కార్మికులకు 11 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం. ప్రభుత్వంలో విలినంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ.
    334 Views
  • గోదావరిఖని : గౌరవ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ గారి మరియు మేయర్ గారి ఆదేశాల మేరకు, స్థానిక 9 వ డివిజన్ ప్రెస్ క్లబ్, వినోబా నగర్ గత 30 ఏళ్లుగా ఉన్న నీటి సమస్యలను గౌరవ కార్పొరేటర్ తాళ్లపల్లి యుగేందర్ గారి ఆధ్వర్యంలో నీటి సమస్యలను పరిష్కరించడం జరిగింది.
    411 Views
  • టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల.
    టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో రాతపరీక్షలు ఈ నెల‌ 29 లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచన మే 2 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి హాల్‌టికెట్లు  పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని వెల్లడి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని...
    231 Views
  • సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.
      సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.  Andhra CM Chandrababu will visit Mumbai tomorrow  ఎకనమిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు చంద్రబాబు ఎంపిక పాలనలో సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం రేపు ముంబైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.20 లక్షల కోట్ల...
    213 Views
  • కారేపల్లి పోలీస్ స్టేషన్ లో పెద్ది నిర్బంధం... ఖమ్మం జిల్లా
    ఆర్టీసీ డ్రైవర్ మృతితో నిరసన వ్యక్తిత్వం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి నీ అరెస్టు చేసి ఏసీపీ రవీందర్ రెడ్డి తన వాహనంలో నర్సంపేట..నెక్కొండ.. తొర్రూర్.. ఖమ్మం మీదుగా కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు...  పెద్ది వెంట మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సుకునే రాజేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి మెరుగు రాంబాబు ఉన్నారు....
    311 Views
  • తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్‌ఎస్‌
    పార్టీ పేరులో “టీఆర్‌ఎస్‌” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమ కాలం నుంచి TRS అనే పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‎తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగేలా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ రాష్ట్ర రాజకీయ వేదికపై కొత్త చర్చకు తెరలేపారు. మేడ్చల్ జిల్లా...
    243 Views