Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో
    స్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982) వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లో24.04.2026 శుక్రవారం రోజు మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తించి గ్రూప్ -1 లో సెలెక్ట్ అయి మంచిర్యాల జిల్లా లో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన దుర్గం క్రాంతికుమార్ గారిని కలెక్టర్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి...
    1K Views
  • ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో
    స్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982) వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లో24.04.2026 శుక్రవారం రోజు మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తించి గ్రూప్ -1 లో సెలెక్ట్ అయి మంచిర్యాల జిల్లా లో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన దుర్గం క్రాంతికుమార్ గారిని కలెక్టర్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి...
    338 Views
  • పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
    రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద గన్న రెడ్డమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును తస్కరించి, ద్విచక్ర వాహనంలో పరారైన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో, సీసీ కెమెరాల పరిశీలన అనంతరం, గురువారం సోమలలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం...
    217 Views
  • పుంగనూరులో ఆకట్టుకున్న మారెమ్మ అలంకరణ
    పుంగునూరు పట్టణ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ అర్చకులు అమ్మవారికి ఉదయం నదీ జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేసి, అనంతరం పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు# కొత్తూరు మురళి .
    211 Views
  • అమరనాథ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేత
    శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శాలువా, ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు స్థానికులైన చంద్రశేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    235 Views
  • పుంగనూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష
    తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఎల్. ఎస్. విజయ్ అలియాస్ సుధాకర్ (29)కు తిరుపతి ఆర్.ఎస్.ఎస్.ఏ.డి.జె. కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది. శుక్రవారం రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ ఈ వివరాలు వెల్లడించారు. ఇతనిపై 2018లో రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయమూర్తి నరసింహమూర్తి ఈ తీర్పు వెలువరించారు.
    237 Views
  • పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్
    కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం బట్టువారిపల్లెలోని ఒక గోడౌన్లో దాచి ఉంచిన సుమారు రూ. 15 లక్షలు విలువచేసే 30 టన్నుల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టామని, సోదాలు కొనసాగుతున్నాయని, మరిన్ని బెల్లం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.
    220 Views
  • పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిశీలించిన డీఎస్పీ పావని
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లె డిఎస్పి పావని పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఆమె సమీక్షించారు. గ్రామాలలో పల్లె నిద్రలు తప్పనిసరిగా చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు, ఎస్సైలు అన్సర్ బాషా, కెవి రమణ, పోలీసు సిబ్బంది...
    225 Views
  • మదనపల్లె గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
    మదనపల్లెలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 3 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. రంగనాయకులు తెలిపారు. 3వ తరగతిలో 40 సీట్లు, 4వ తరగతిలో 36, 5వ తరగతిలో 32, 6వ తరగతిలో 25, 7వ తరగతిలో 21, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉచిత వసతి, ఆహారం, పుస్తకాలు, యూనిఫాం సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి గలవారు మే 20లోపు దరఖాస్తు...
    242 Views
  • పుంగనూరు: శేష వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఉత్సవమూర్తులను శేష వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ఉభయదారులుగా వ్యవహరించింది# కొత్తూరు మురళి.
    219 Views