Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "అతి శబ్దం చేస్తే అంతే సంగతులు: ఒక్క రోజే 182 కేసులు, రూ. 2.44 లక్షల జరిమానా.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర రోడ్లపై అతి శబ్దంతో ప్రయాణిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్ల వాడకంపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో ఏప్రిల్ 20న నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీల్లో ప్రధాన జంక్షన్ల వద్ద...
    576 Views
  • "కన్నబిడ్డను వెతికిచ్చిన దేవుళ్లు.. అల్వాల్ పోలీసుల అంకితభావానికి సెల్యూట్!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కళ్లముందే ఆడుకుంటున్న కన్నబిడ్డ మాయమైతే ఆ తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పనైంది. కానీ అల్వాల్ పోలీసులు కేవలం 45 నిమిషాల్లోనే ఆ చిన్నారిని సురక్షితంగా వెతికి పట్టుకుని, తమలోని మానవీయ కోణాన్ని మరియు వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లోతుకుంట, లక్ష్మీనగర్ కాలనీలో నివసించే ప్రవీణ్ కుమార్ పురోహిత్ కుమారుడు మయూర్ పురోహిత్ (7 ఏళ్లు)....
    477 Views
  • జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తా...సీఎం రేవంత్ రెడ్డి
    జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ టిక్కెట్ ఇస్తిమీ.. అయినా నువ్వు ఓడిపోతే మా తప్పా..? - సీఎం రేవంత్ రెడ్డి  ‎అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే జీవన్ రెడ్డి చూసి ఓర్వలేక పోయారని ముఖ్యమంత్రి విమర్శించారు. ‎కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డిపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు....
    262 Views
  • రేవంత్ రెడ్డికి పాడను‎ఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే ‎: గాయని మధుప్రియ
    బాపు కెసిఆర్ తెలంగాణకొక ఎమోషనల్ అని, ప్రతి ఇంట, ప్రతి హృదయంలో కెసిఆర్ ఉన్నారని గాయని మధుప్రియ అన్నారు. ఎటు చూసినా కూల్చివేతలు, కరెంట్ కష్టాలు, రైతుల ఇక్కట్లు మినహా ఈ ప్రభ్యత్వంలో ఇంకేం కనిపించడం లేదని, మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం జగిత్యాల బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన మధుప్రియ మీడియాతో మాట్లాడారు. ‎భారీ సభలో తాను పాడి రెండేళ్లు అయ్యిందని,...
    256 Views
  • మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం..కేసీఆర్
    హైదరాబాద్‌లో హైడ్రాపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు ‎ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. Hyderabadలో హైడ్రా చర్యలను లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు. ‎హైదరాబాద్‌లో హైడ్రా తెచ్చారని, నిజామాబాద్‌లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రా కూడా తెస్తారేమో అంటూ వ్యంగ్యం ‎ఇళ్లను కూల్చే సమయంలో ప్రజలకు సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శ ‎మళ్లీ...
    252 Views
  • జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంది అంటే.. రెండో విడత రైతుబంధు ఇస్తున్నారు. ‎మూడవ విడత ఇవ్వాలంటే కేసీఆర్ ఇంకో సభ పెట్టాల్నా?
    కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర్శించారు. ‎ఇది అసలు రాజకీయమా అని ప్రశ్నించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే...
    273 Views
  • మదనపల్లి లో జువెలరీ మోసం ఆరోపణలు… ఎస్పీకి ఫిర్యాదు.
    మదనపల్లెలోని మణప్పురం ఫైనాన్స్ రిథి జువెలరీస్ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 170 మంది తమ సమస్యలను తెలియజేశారు. వీరిలో కొందరు జువెలరీలో జరిగిన మోసంపై ఫిర్యాదు చేయగా, ఎస్పీ విచారణకు ఆదేశించారు.
    227 Views
  • మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎస్పీ.
    మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. కుటుంబ వివాదాలు, సైబర్ నేరాలు, భూ తగాదాలు వంటి సమస్యలపై అలసత్వం లేకుండా చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించిన ఎస్పీ, ప్రజలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
    218 Views
  • 22-A భూ సమస్యలకు చెక్… రైతులకు ఊరట.
    మదనపల్లిలో 22-ఎ భూ సమస్యల పరిష్కారానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం సోమవారం వేగం పెంచింది. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆధ్వర్యంలో పెండింగ్ కేసులను పరిశీలించి పది మంది రైతులకు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. సర్వే నంబర్ సవరణలు, అడంగల్ లోపాలు వంటి సమస్యలు పరిష్కరించడంతో రైతులకు ఉపశమనం లభించింది. భూమి రికార్డులు సరిచేయడం ద్వారా రుణాలు, లావాదేవీలు సులభమవుతాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను...
    230 Views