అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిప్రమాదాలు నివారణపై అవగాహన కల్పించారు. ఆసుపత్రిలలో అగ్నిప్రమాదాలు జరిగితే రోగులను ఎలా కాపాడాలి, మంటలను ఎలా అదుపు చేయాలో వివరించారు. ఫైర్ ఎక్సటింగ్ విషర్స్ వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు.
#Boiena Rajesh
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు.
రైతుభరోసా పంపిణీ చేయకపోవడంపై కచ్చితంగా కేసీఆర్ ఈ సభ సాక్షిగా ప్రశ్నిస్తారని, రైతుల తరఫున నిలదీస్తారని రేవంత్...
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో
ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి కి చెందిన *చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మా మరియు వారి చెల్లెలు జ్యోతి* ఈరోజు జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో *కల్వకుంట్ల కవిత అక్క* చేతులమీదుగా కండువా కప్పి ఆహ్వానించారు
ఈ సందర్బంగా శోభా, జ్యోతి...
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ... ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు.
ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె.
స్వరాష్ట్ర సాధన కోసం...
కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్
కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే
కేటీఆర్ కు అహంకారం అక్రమ సంపాదన ఎక్కువని
మండిపడ్డారు. క్రాస్ ఓటింగ్ చేసిన క్రాస్
బ్రీడ్ మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది. కలెక్టర్ నిషాంత్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, 'జలధార-జలహారతి' కార్యక్రమానికి కలెక్టర్ నిషాంత్ కుమార్ ను నోడల్ అధికారిగా నియమించారు. ఆయన మార్గదర్శకత్వంలో భూగర్భ జలాల పెంపుపై కార్యాచరణ చేపట్టాలని సీఎం...
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సుమన్ స్కూటర్‌తో అభిలాష్‌ను ఢీకొట్టడంతో స్థానికులు అతనిపై దాడి చేశారు. అనంతరం సుమన్ కత్తితో బాబు, సుధాకర్, సోమశేఖర్‌లపై దాడి చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. గ్రామస్తులు సుమన్‌ను పట్టుకుని కొట్టి గాయపరిచారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గాయపడినవారు చికిత్స...
మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న సీటీఎం రోడ్డులో తట్టివారిపల్లి చెరువు కట్టపై శంకర్ హత్యకు గురయ్యారు. దర్యాప్తులో రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్ (25), వినయ్ కాంత్ (25)లను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గొడవ కారణంగా శంకర్‌ను బండరాయితో కొట్టి హత్య...
ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి 29 మందిని అరెస్ట్ చేశారు. చీకిల బైలులో పేకాట ఆడుతున్న 14 మందిని, నీరుగట్టు వద్ద కోడి పందేలు ఆడుతున్న నలుగురిని, రామాపురంలో మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, ఫోన్లు, కోళ్లు, బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ పావని తెలిపారు.
మదనపల్లె జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం క్రీడాభారతి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలు పాల్గొన్నారు. అండర్-14లో నెహ్రూ మున్సిపల్ స్కూల్, అండర్-17లో కలిచెర్ల జెడ్పీ స్కూల్, అండర్-19లో జ్ఞానాంబిక కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి. ముగింపు కార్యక్రమంలో అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి దోహదం చేస్తాయని...