Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • *AP*

    *మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ.*

    *జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్.*

    *ఈ నెల 20 నుంచి 27 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.*

    *- ఏపి ఇంటర్ బోర్డ్ ప్రకటన.*
    150 Views
  • "బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు. డీసీపీ చౌ. శ్రీధర్ ఐపీఎస్ నేతృత్వంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ మెరుపు దాడుల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా...
    604 Views
  • ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనందంగా ఉంది.

    ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (IIHFW) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, నా సంకల్పం గురించి కలెక్టర్ గారితో పంచుకున్నాను. ప్రజారోగ్య రంగంలో మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలను స్వీకరించాను.

    ఈ సందర్భంగా కలెక్టర్ గారు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది.
    405 Views
  • "మీసేవా కేంద్రాలపై ఏసీబీ పంజా: అల్వాల్, ఖైరతాబాద్‌ సహా పలుచోట్ల సోదాలు.|
    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) బుధవారం హైదరాబాద్‌లోని పలు మీసేవా కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. అల్వాల్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, మల్లేపల్లి వంటి కీలక ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు మీసేవా కేంద్రాల్లో కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల జారీ కోసం సిబ్బంది దళారులతో చేతులు కలిపి సామాన్య ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు...
    742 Views
  • అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర: బేబినాయన
    పట్టణం, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా అన్నారు. బొబ్బిలి సూర్య రెసిడెన్సీలో బుధవారం పదవి విరమణ చేసిన సర్పంచులు, కౌన్సిలర్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. మున్సిపాలిటీలు అభివృద్ధిలో కౌన్సిలర్లు, పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యలపై పని చేశారని చెప్పారు....
    309 Views
  • మదనపల్లి: అగ్నిమాపక అవగాహన ర్యాలీ నిర్వహణ.
    జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మదనపల్లిలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మదనపల్లె అగ్నిమాపక కేంద్రం నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 101కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
    249 Views
  • ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
    మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విభాగంలో సమ్రీన్ 980, బి. రోహిణి 976 మార్కులు సాధించగా, బైపీసీలో సోఫియా ఫిరడోస్ 962, నిహారిక 941 మార్కులు పొందారు. సీఈసీలో రమాదేవి 896, శారదా 884, హెచ్ఈసీలో నాగమణి 958 మార్కులతో మెరిశారు. కళాశాల మొత్తం 80% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
    265 Views
  • మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.
    మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. వడ్డిపల్లికి చెందిన లక్ష్మీదేవికి రూ. 51 వేలు, సుమిత్రకు రూ. 1, 71,000 అందించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 7 కోట్లకు పైగా సీఎం సహాయనిధి పంపిణీ చేశామని, తాజాగా రూ. 2.23 లక్షలు అందించామని ఆయన తెలిపారు. ఈ నిధి నిరుపేదలకు వరమని ఆయన అభివర్ణించారు.
    240 Views