నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఎన్ఆర్పియం హైస్కూల్ లో విద్యార్థులకు డైనింగ్ హాల్ ఉందని డొక్కా సీతమ్మ భోజనం పథకం లో భోజనం చాలా అద్భుతంగా ఉందని,కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం విద్యార్థులు ఆరోగ్యం, పాఠశాలల అభివృద్ధిని పాఠశాల అభివృద్ధికి కొరకు తన వంతు కృషి...
చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి...
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రజలు కొనియాడారు.బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించారు.వార్డుకు ఆరోగ్య కేంద్రాన్ని తెప్పించడంతోపాటు,బాయ్స్ హైస్కూల్ ని,పార్క్ ని అభివృద్ధి చేశారని తెలిపారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించారని,సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయించారని వారు తెలిపారు.ప్రజలకు...
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనాలకు పెట్రోల్ కొట్టేటప్పుడు ఫోన్ మాట్లాడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో ద్వారా వివరించారు# కొత్తూరు మురళి.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో సోమవారం వరిగడ్డి వామికి అగ్ని ప్రమాదం సంభవించింది. యనమసామనపల్లి గ్రామానికి చెందిన నాగార్జున రెడ్డికి చెందిన ఈ వామిలో సుమారు రూ. 20 వేల నష్టం వాటిల్లినట్లు పుంగనూరు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు# కొత్తూరు మురళి.
తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఆనందం పొందుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ...
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది బి. సురేష్ బాబు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల మేరకు ఆయన సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి నియామక పత్రాలను అందుకున్నారు. అనంతరం పుంగనూరు కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరీఫా ను కలిసి ఏజీపీగా తన బాధ్యతలను అధికారికంగా చేపట్టారు# కొత్తూరు...
రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజకుమార్, పీలేరు నుంచి రొంపిచర్లకు బైకుపై వెళ్తుండగా ఎర్రగుంటపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజకుమార్ కోమాలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు# కొత్తూరు మురళి.
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో పవన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం పవన్ ను తిరుపతికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి .
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై 50 శాతం వరకు అదనపు ఛార్జీలు విధించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్ పండుగలు ఉండటంతో, 17, 18 తేదీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే...