Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • యువకుడి పై కత్తితో దాడి.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె కోళ్లబైళ్ళు2 పరిధిలో ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన సోమవారం కలకలం రేపింది. సోమశేఖర్ కుమారుడు భార్గవ్ (20) పై ఈశ్వర్ రెడ్డి కుమారుడు కార్తీక్ (క్రాంతి) దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో భార్గవ్ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
    291 Views
  • మదనపల్లి: అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి 346 అర్జీలను స్వీకరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో PGRS అర్జీలపై సమీక్షలు జరుగుతున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి...
    291 Views
  • అమరజీవి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కలెక్టర్.
    ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సోమవారం, పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు వర్చువల్‌గా వీక్షించారు
    357 Views
  • అభివృద్ధి పనులు, రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు ఫీడర్, సప్లై చానళ్లలో పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మదనపల్లె-పీలేరు, రాయచోటి బైపాస్ జాతీయ రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పల్లె పండుగ, జలజీవన్ మిషన్ కింద చేపట్టిన సీసీ రోడ్లు, వాటర్ గ్రిడ్ పనుల్లో జాప్యం చేయరాదని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో...
    292 Views
  • *ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..💐🤝*

    *ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి కి వచన కవిత్వం భాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు*

    *ఆయన రచించిన "అనిమేష" కవితా సంపుటికి గాను ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం*

    *సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మందం బందారం*
    498 Views
  • ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.
    తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి ఆరోపించారు. తన ఇంటిని కాపాడి, ప్రాణహాని నుంచి రక్షించి న్యాయం చేయాలని ఆయన కోరారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదు చేశారు.
    276 Views
  • ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
    ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించింది. లాస్ ఏంజెలెస్‌‍లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఇన్ మెమొరియన్ అనే విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాల పేర్లను అకాడమీ తన...
    441 Views
  • PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు.
    ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద నిర్మించే పేదల ఇళ్లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.2.39 లక్షలు అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1.20 లక్షల రాయితీని...
    327 Views
  • Warm Welcome to @Kodam Prasad !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    462 Views
  • KCR సంచలన నిర్ణయం: పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!
    బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు...
    358 Views