Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
    సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో సంప్రదాయ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.  ‎ప్రధాన ఉత్సవం: గ్రామస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారికి విశేష పూజలు, ధూపదీప...
    358 Views
  • ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక
    రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మైనారిటీ అండ్ న్యాయ శాఖ మంత్రి ఎవరు ఎన్ ఎమ్ డి ఫారుక్ గారు మైనారిటీ సీనియర్ నాయకులు అమీర్ బాబు గారు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రాముఖ్యత చేకూర్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి అభిప్రాయాలు సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై...
    358 Views
  • పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
    పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన విద్యార్థులకు పరీక్షలు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో రాయాలని ఆకాంక్షించారు ప్రతి విద్యార్థి నుంచి మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించి తమ తల్లిదండ్రులకు గురువులకు గర్వకారణం కావాలని ఆదేశించారు అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సౌకర్యార్థం ప్రభుత్వం...
    362 Views
  • పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాల ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన...
    346 Views
  • పుంగునూరు నియోజకవర్గం:కందూరు గ్రామంలో ఘనంగా గంగజాతర: భక్తుల కోలాహలం
    అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా గంగజాతర జరిగింది. ఈ జాతరను సోమల మండలంలోనే అతి పెద్ద గంగజాతరగా పరిగణిస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ప్రతియేటా బలులు, దీప నైవేద్యాలతో అమ్మవారిని మొక్కుకుంటారు# కొత్తూరు మురళి.
    349 Views
  • పుంగనూరు నియోజకవర్గంలో గంగ జాతర
    పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున అమ్మవారిని నడివీధిలో నిలపి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు అమ్మవారికి దీలు మోసి, చల్లని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు# మురళి.
    353 Views
  • ఆగి ఉన్న లారీ కింద నిద్రించి.. చక్రాల కింద నలిగి యువకుడు మృతి.
    మదనపల్లెలోని నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీ కింద నిద్రపోయిన అశోక్ కుమార్ (26) అనే యువకుడు, సోమవారం ఉదయం లారీ డ్రైవర్ వాహనాన్ని కదిలించడంతో చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. బసినికొండకు చెందిన అశోక్ కుమార్ ఇండేన్ గ్యాస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    311 Views
  • పుంగనూరు నియోజకవర్గ : రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకుందాం
    రైతులు పంటలు పండించడానికి రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకోవాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు సూచించారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంటలో అగ్రికల్చర్ ఇన్చార్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తక్కువగా పడతాయని, కావున...
    299 Views
  • రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
    మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం సృష్టించింది. డీటీవో అశోక్ ప్రతాప్ రావు, ఎంవీఐలు వాహనాలను సోమవారం తనిఖీ చేస్తుండగా తాను జిల్లా రిపోర్టర్నని చెప్పుకుంటూ ఓ యువకుడు అధికారులను వీడియో తీస్తూ కేసు వేసుకోండి. మేము చూసుకుంటాం' అని విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
    369 Views
  • మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.
    మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనిపై రాయల్పాడు వెళ్లి తిరిగి వస్తుండగా, చీకిలబైలు గ్రామం వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పీడ్ బ్రేకర్ల వద్ద అప్రమత్తత లోపించడం లేదా అవి సరిగా కనిపించకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుందని తెలుస్తోంది.
    307 Views